Telangana MLC polls : హైదరాబాద్ పట్టభద్రుల ఎన్నిక ఫలితాలు, విజేత ఎవరో నిర్ణయించేది ప్రొ.నాగేశ్వర్

హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది.

MLC Election Counting : హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. గత నాలుగు రోజుల నుంచి ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. కానీ..విజేత ఎవరో ఇంకా తేలలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోవడంతో..ఎలిమినేషన్ ప్రక్రియను అధికారులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. చివరి నుంచి తక్కువ ఓట్లు వచ్చిన ఒక్కో అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ.. వారి సెకండ్ ప్రియార్టీ ఓట్లను మిగిలిన వారికి కలుపుతున్నారు.

ఈ ప్రాసెస్ పూర్తయ్యాక ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటించాలని ఈసీ నిర్ణయించింది. దీంతో తెలంగాణలో రాష్ట్రంలో జరుగుతున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఫలితం శనివారం రాత్రికి తేలే అవకాశం ఉందని భావిస్తున్నారు.

హైదరాబాద్-మహబూబ్ నగర్-రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యాత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 89 మందిని ఎలిమినేట్ చేయడం పూర్తయ్యింది. వీరిలో టీడీపీ అభ్యర్ధి ఎల్. రమణతో పాటు… స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ కూడా ఉన్నారు. మొదటి, రెండో ప్రాధాన్యతా ఓట్లతో కలిపి టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి లక్షా 19 వేల 619 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు లక్షా 10వేల 500 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ 59 వేల 648 ఓట్లు… కాంగ్రెస్ అభ్యర్ధి చిన్నారెడ్డి 36వేల 726 ఓట్లు సాధించారు…

అయితే… ఈ కౌంటింగ్ ప్రక్రియలో ట్విస్ట్ నెలకొంది. మూడు, నాలుగో ప్రాధాన్యత లెక్కింపు అవసరం లేకుండానే విజేతను ప్రకటించే అవకాశం ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎలిమినేషన్ తర్వాత.. ఎవరు లీడ్‌లో ఉంటే వారినే విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. వాణీదేవికి 1,28,010 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుకు 1, 19, 198 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొ. నాగేశ్వర్ కు 67 వేల 383 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం వాణీదేవికి 8812 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తాజాగా..ప్రొ.నాగేశ్వర్ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు