Hyderabad
Hyderabad : ప్రపంచంలోని ఉత్తమ 100 నగరాల్లో తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి చోటు లభించింది. రెసోనెన్స్ కన్సల్టెన్సీ, ఇప్సోస్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ కలిపి ‘వరల్డ్ బెస్ట్ సిటీస్’ రిపోర్టులో భాగంగా మొత్తం ప్రపంచంలోని 276 నగరాలను పరిశీలించారు. వాటికి 100 ఉత్తమ నగరాలుగా ర్యాంకింగ్ ఇచ్చారు. ఆ ర్యాంకింగ్స్ లో హైదరాబాద్ నగరానికి చోటు దక్కింది.
Also Read : TS SSC Exam : పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. కొత్త పద్ధతిలో టెన్త్ పరీక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
ప్రపంచంలో 100 ఉత్తమ నగరాల్లో క్యాపిటల్స్ ఆఫ్ క్యాపిటల్ గా పేరున్న లండన్ వరుసగా 11వ సారి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. రెండో స్థానంలో న్యూయార్క్, మూడో స్థానంలో ప్యారిస్, నాల్గో స్థానంలో టోక్యో, ఐదో స్థానంలో మాడ్రిడ్, ఆరో స్థానంలో సింపూర్, ఏడో స్థానంలో రోమ్, ఎనిమిదో స్థానంలో బెర్లిన్ నిలిచాయి.
భారతదేశంకు చెందిన నాలుగు నగరాలు 100 ఉత్తమ నగరాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. బెంగళూరు 29వ స్థానంను దక్కించుకోగా.. ముంబై 40, ఢిల్లీ 54వ స్థానంలో నిలిచింది. ఇక హైదరాబాద్ 82వ ప్లేస్ లో నిలిచింది. దీంతోపాటు హైదరాబాద్ కు మరో అరుదైన గౌరవం కూడా దక్కింది. టాప్ 100 టేస్టీ నగరాల జాబితాలోనూ హైదరాబాద్ నగరానికి చోటు దక్కింది. ఆ జాబితాలో 50వ స్థానంలో నిలిచింది.
భారతదేశంలో బెంగళూరు టాప్ లో నిలిచింది. టెక్ ఎకోసిస్టం, విస్తరించిన కార్పొరేట్ బేస్ వల్ల బెంగళూరు 29వ స్థానాన్ని సాధించింది. ఉద్యోగాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, ఇన్నొవేషన్ కేంద్రంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై 40వ స్థానంలో నిలిచింది. రాజకీయ ప్రభావం, రవాణా కనెక్టివిటీ, అభివృద్ధి చెందుతున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా ఢిల్లీ 54వ స్థానంలో నిలిచింది. ఇక టెక్నాలజీ విస్తరణ, ఐటీ సేవల కేంద్రంగా ఎదుగుతున్న హైదరాబాద్ 82వ స్థానంలో సాధించింది. మరోవైపు.. దేశంలోనే పెద్ద సిటీగా హైదరాబాద్ నిలిచింది. మరోవైపు.. చెన్నై, కోల్‌కతా వంటి నగరాలనుసైతం పక్కన పెట్టి హైదరాబాద్ ముందంజలో నిలిచింది.
Also Read : AP Rains : ఏపీ వైపు దూసుకొస్తున్న మరో వాయుగుండం.. అత్యంత భారీ వర్షాల అలర్ట్.. వాతావరణ రిపోర్ట్ ఇలా..