హైదరాబాద్ నగరంలో సాయంత్రం 5.30 గంటలకు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైడ్రా హెచ్చరికలు చేసింది. పలు ప్రాంతాల్లో 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైడ్రా అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీములను అలెర్ట్ చేశామని అన్నారు.
భారీ వర్షం పడుతున్న కారణంగా వాహనదారులు తమ ప్రయాణాన్ని కొంత సమయం పోస్ట్ పోన్ చేసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. జూబ్లీహిల్స్, బంజరా హిల్స్ ఏరియాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఆ ఏరియాల్లో వెళ్లే వారు అలర్ట్ గా ఉండాలి.
ఈ ప్రాంతాల్లోనూ వర్షం
పంజాగుట్ట, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్, నాగోలు, హయత్ నగర్, ఎస్.ఆర్.నగర్, కూకట్ పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
ఉప్పల్, రామంతపూర్, తార్నాక, ఓయూ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాలు కూడా వర్షానికి తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, పంజాగుట్ట ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది.