హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ ఆరోగ్యంపై కిమ్స్ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రెండు రోజులుగా మినిమల్ వెంటిలేటర్‌తో శ్రీతేజ్‌కు వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.
న్యూరోలాజికల్ స్టేటస్‌లో పెద్దగా మార్పు లేదని చెప్పారు. పైప్ ద్వారానే శ్రీతేజ్‌కు ఆహారం అందిస్తున్నామన్నారు. ఎడమవైపు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ తగ్గిందని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
కాగా, బాధిత కుటుంబానికి ఇప్పటికే పుష్ప-2 సినిమా యూనిట్ 2 కోట్ల రూపాయల పరిహారాన్ని ఇచ్చింది. హీరో అల్లు అర్జున్ రూ.కోటి, పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలు, నిర్మాతలు రూ.50 లక్షలు ఇచ్చారు. శ్రీతేజ్‌ను ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు.
కోర్టులో కేసు ఉన్న కారణంగా అల్లు అర్జున్ పరామర్శించలేకపోయారు. శ్రీతేజ్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని ఇటీవలే దిల్ రాజు తెలిపారు. పుష్ప-2 సినీ బృందం అందించిన మొత్తాన్ని బాధిత కుటుంబంతో మాట్లాడి ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన చెప్పారు.