యుక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంలో హైదరాబాద్ యువకుడు మృతి

Russia Ukraine war: అఫ్సన్‌ను రష్యాలో హెల్పర్ ఉద్యోగం కోసం హైదరాబాద్ నుంచి ఏజెంట్స్ తీసుకెళ్లారు.

Hyderabad man killed while fighting in Russia Ukraine war

యుక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంలో హైదరాబాద్ యువకుడు మృతి చెందాడు. అతడు పాతబస్తీ వాసి మహమ్మద్ ఆఫ్సన్‌ (30) అని తెలుస్తోంది. ఆ యువకుడిని ఉపాధి కోసం ఏజెంట్లు రష్యాకు తీసుకెళ్లి బలవంతంగా సైన్యంలో చేర్పించారు. ఆఫ్సన్ మృతి చెందినట్లుగా అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.

అఫ్సన్‌ను రష్యాలో హెల్పర్ ఉద్యోగం కోసం హైదరాబాద్ నుంచి ఏజెంట్స్ తీసుకెళ్లారు. రష్యా నుంచి తనను సొంత ప్రాంతానికి రప్పించేందుకు ఏర్పాటు చేయాలని కొన్ని రోజులుగా ఆఫ్సన్ కోరుతున్నాడు. అతడు చనిపోయినట్లు సమాచారం అందడంతో మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకురావాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అఫ్సన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా సేవలు అందిస్తున్న 20 మంది భారతీయులను సొంత దేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇటీవలే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ ప్రకటన వచ్చిన కొన్ని రోజులకే అఫ్సన్ మృతి ఘటన వెలుగుచూసింది.

Viral Video: రోడ్డుపై కారును ఇష్టం వచ్చినట్లు నడిపి.. బెంబేలెత్తించిన యువకుడు