Viral Video: రోడ్డుపై కారును ఇష్టం వచ్చినట్లు నడిపి.. బెంబేలెత్తించిన యువకుడు

నంబరు ప్లేటును దాచి పోలీసులకు కనపడకుండా వెళ్లడానికి ప్రయత్నించినప్పటికీ..

Viral Video: రోడ్డుపై కారును ఇష్టం వచ్చినట్లు నడిపి.. బెంబేలెత్తించిన యువకుడు

Updated On : March 6, 2024 / 7:22 PM IST

ఢిల్లీలోని నజఫ్‌గఢ్-రాజౌరీ గార్డెన్ రహదారిపై ఓ యువకుడు కారుతో ప్రమాదకరమైన విన్యాసాలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు కారును సీజ్ చేశారు.

నంబరు ప్లేటును దాచి పోలీసులకు కనపడకుండా వెళ్లడానికి ప్రయత్నించినప్పటికీ ఆ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నజఫ్‌గఢ్-రాజౌరీ గార్డెన్ రహదారిపై ఎస్వీయూ కారును అటూఇటూ ఇష్టం వచ్చినట్లు వేగంగా తీసుకెళ్లాడు నిందితుడు. ఈ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రోడ్డుపై అంత నిర్లక్ష్యంగా అతడు డ్రైవింగ్ చేసిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఫార్చ్యూనర్ కారును గుర్తించి, స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.

ఆ యువకుడు వీడియోలు తీసుకోవడానికే ఇలా ప్రవర్తించాడా? అన్న వివరాలు తెలియరాలేదు. రోడ్లపై ఇటువంటి స్టంట్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా పదే పదే ఇటువంటి స్టంట్లకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

 Read Also: బాలుడి వద్దకు వచ్చిన చిరుతపులి.. చాకచక్యంగా తప్పించుకున్న విద్యార్థి