బాలుడి వద్దకు వచ్చిన చిరుతపులి.. చాకచక్యంగా తప్పించుకున్న విద్యార్థి

బాలుడు మోహిత్ (12) ఇంట్లో కూర్చున్న సమయంలో అక్కడకు ఓ చిరుతపులి వచ్చింది.

బాలుడి వద్దకు వచ్చిన చిరుతపులి.. చాకచక్యంగా తప్పించుకున్న విద్యార్థి

ఒక్కసారిగా క్రూర మృగాలను చూస్తే స్పృహతప్పి పడిపోతాం. ఇక చిన్నపిల్లలకు ఇటువంటి అనుభవం ఎదురైతే వారి పరిస్థితిని ఊహించుకోలేం. అయితే, ఇంట్లోకి వచ్చిన చిరుతపులి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న ఓ బుడ్డోడు అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు.

మహారాష్ట్ర మాలెగావ్‌కి చెందిన బాలుడు మోహిత్ (12) ఇంట్లో కూర్చున్న సమయంలో అక్కడకు ఓ చిరుతపులి వచ్చింది. ఇంటి ముందు కాసేపు తిరిగి, గదిలోని ప్రవేశించింది. తలుపు వద్దే కూర్చుని, మొబైల్ లో చూస్తున్న ఆ బాలుడు తన ముందు నుంచి పులి వెళ్లడాన్ని గమనించాడు.

ఇంట్లోకి చిరుతపులి వెళ్లగానే మెల్లిగా బయటకు వెళ్లిపోయి, గది బయట తలుపులు వేసేశాడు. ఆ తర్వాత తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాడు. అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని చిరుతను తీసుకెళ్లారు. మోహిత్ సమయస్ఫూర్తితో వ్యవహరించిన తీరు అందరికీ ఆదర్శమని అధికారులు మెచ్చుకుంటున్నారు. పులి వచ్చినప్పుడు కెమెరికాలో రికార్డయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.