Telangana Rain : తెలంగాణాలో నేటి నుంచి మూడురోజులపాటు వర్షాలు.. వాతావరణ కేంద్రం హెచ్చరికలు

సోమవారం, మంగళవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Telangana Rain

Rain In Telangana : తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం, మంగళవారం, బుధవారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

సోమవారం, మంగళవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30 నుండి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. బుధవారం ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని పేర్కొంది.

Southwest Monsoon : రాయలసీమను తాకిన రుతుపవనాలు

సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, కొమరం భీం, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వివరించింది.

నైరుతి రుతుపవనాలు సోమవారం కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు మరియు కొంకణ్, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్ లోని మరికొన్ని ప్రాంతాలకు వ్యాపించాయని తెలిపారు. దిగువ స్థాయిలోని గాలులు.. ముఖ్యంగా పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని పేర్కొన్నారు.