Hyderabad Metro: ప్రయాణికులకు గమనిక.. ఆ మార్గంలో హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు

మిగతా మార్గాల్లో మెట్రో రైళ్ల వేళల్లో ఎలాంటి మార్పులూ లేవు.

Hyderabad Metro

Hyderabad  Metro Rail: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా జేబీఎస్ (JBS) నుంచి సీబీఎస్ వెళ్లే మార్గంలో మెట్రో రాకపోకలలో మార్పులు చేసినట్లు ఎల్అండ్‌టీ అధికారులు ప్రకటించారు. జీహెచ్ఎంసీ (GHMC) అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

జూన్ 30వ తేదీ నుంచి జులై 16వ తేదీ వరకు ఈ మార్గంలో మెట్రో రైళ్లు ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తాయని వివరించారు. సాధారణంగా ఉదయం 6 గంటలకు ప్రారంభం కావలసిన రైలు సేవలు అర్ధగంట ఆలస్యంగా ప్రారంభం అవుతాయి.

మిగతా మార్గాల్లో మెట్రో రైళ్ల వేళల్లో ఎలాంటి మార్పులూ లేవు. హైదరాబాద్ మెట్రో రైలు ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలో అత్యంత రద్దీగా ఉంటుంది. ఆ తర్వాత నాగోల్-రాయ్ దుర్గ్ మార్గంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. జేబీఎస్ – ఎంజీబీఎస్ మార్గంలో అంతగా రద్దీ ఉండదు.

Hari Rama Jogaiah : అధికారం చేపట్టాలంటే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలి.. రాజకీయ పరిస్థితులపై హరి రామ జోగయ్య లేఖ విడుదల