Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డు.. ఒక్క రోజే 5.47 లక్షల మంది ప్రయాణం

హైదరాబాద్ మెట్రో రైలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. మెట్రో రైలులో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతోంది.

Hyderabad Metro Train New Record : హైదరాబాద్ మహా నగరంలో చాలా మంది మెట్రో రైలు ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు. త్వరగా ఆఫీసులకు, గమ్య స్థానాలకు చేరుకునేందుకు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ కష్టాలను తప్పించుకోవడానికి కూడా చాలా మంది మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు. మెట్రో రైలు ప్రయాణం ప్రశాతంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో రైలు ప్రయాణికులు రోజు రోజుకు పెరుగుతున్నారు.

హైదరాబాద్ మెట్రో రైలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. మెట్రో రైలులో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతోంది. మెట్రోలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఒక్క రోజులో మెట్రోలో ప్రయాణం చేసే ప్రయాణికుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరింది. ఒకే రోజు మూడు కారిడార్లలో ఉన్న మెట్రో మార్గాల్లో 5.47 లక్షల మంది ప్రయాణించారు. మెట్రో సేవలు ప్రారంభమైన ఆరేళ్లలో ఒక్క రోజు ప్రయాణికుల సంఖ్య 5.5 లక్షలకు చేరువలో ఉండటం ఒక రికార్డని అధికారులు చెబుతున్నారు.

Also Read: సౌదీ అరేబియాలో మెట్రోరైలు నడుపుతున్న తెలుగు మహిళ.. హైదరాబాద్ మెట్రో To రియాద్ మెట్రో వరకు ‘ఆమె‘ ప్రస్థానం

హైదరాబాద్ లో అత్యంత కీలకమైన మార్గాల్లో మెట్రో రైళ్ల రాకపోకలు ఉండటంతో ప్రతి ఏటా ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతోంది. కరోనా ప్రభావం పెద్ద ఎత్తున చూపినా క్రమంగా మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో అందుకనుగుణంగా మెట్రో అధికారులు రైళ్లను ఆయా మార్గాల్లో నడుపుతున్నారు.

హైదరాబాద్ మహా నగరంలో ఐటీ కార్యకలాపాలతో పాటు దసరా, దీపావళి సీజన్ ల సందడి నెలకొనడంతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు జోరందుకున్నాయి. ఐటీ కంపెనీల కార్యక్రలాపాలుండే సోమవారం నుంచి శుక్రవారం వరకు మెట్రో కారిడార్ 3లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుందని అధికారులు తెలిపారు.ఐటీ ఉద్యోగులు ఎక్కువగా మెట్రో రైళ్లలోనే ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు