metro
Hyderabad Metro Staff Strike : హైదరాబాద్ మెట్రో రైలు సిబ్బంది మెరుపు సమ్మె రెండో రోజు కూడా కొనసాగుతోంది. టిక్కెట్లు జారీ చేసే సిబ్బంది ఇవాళ కూడా విధులకు హాజరు కాలేదు. జీతా పెంపుపై హామీ రాకపోవడంతో ఇవాళ కూడా విధులకు దూరంగా ఉన్నారు. జీతాలు పెంచాలని 150 మంది ఉద్యోగులు నిన్న అమిర్ పేట మెట్రో స్టేషన్ వద్ద మెరుపు ధర్నా చేశారు.
తమకు జీతాలు పెంచాలని, దీనిపై స్పష్టత ఇచ్చే వరకు విధులకు హాజరయ్యేది లేదని తేల్చి చెప్పారు. ఎల్ బీ నగర్ -మియాపూర్ కారిడార్ రెడ్ లైన్ మార్గంలో మెట్రో టికెటింగ్ సిబ్బంది జీతాలు పెంచాలని, బెనిఫిట్ కల్పించాలని మెరుపు సమ్మెకు దిగారు. నిన్న మెట్రో, ఎల్ అండ్ టీ, కియోలిస్ సంస్థల ప్రతినిధులు ఉద్యోగులతో జరిపిన చర్చలు కొలిక్కరాలేదు.
జీతాల పెంపుపై ఎలాంటి హామీ రాకపోవడంతో ఈ రోజు కూడా విధులకు హాజరు కావొద్దని మెట్రో టికెటింగ్ ఉద్యగులు నిర్ణయించారు. ఇవాళ నాగోలోని మెట్రో ప్రధాన కార్యాలయంలో మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది.