×
Ad

Hyderabad Numaish 2022 : నేటి నుంచి హైదరాబాద్ నాంపల్లిలో ఎగ్జిబిషన్ ప్రారంభం

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో  81 వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నూమాయిష్) ను గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ఈరోజు సాయంత్రం ప్రారంభిస్తారు.

  • Published On : January 1, 2022 / 10:23 AM IST

Hyderabad Numaish

Hyderabad Numaish 2022 :  హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో  81 వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నూమాయిష్) ను గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ఈరోజు సాయంత్రం ప్రారంభిస్తారు. నూమాయిష్ కు అన్ని శాఖలు అనుమతులు ఇచ్చాయని సొసైటీ సభ్యులు తెలిపారు.

ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకుల తప్పని సరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పారు. ఎగ్జిబిషన్ జరిగినన్ని రోజులు ప్రతి రోజు సాయంత్రం 4 గంటలనుంచి 6 గంటల వరకు ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సందర్శకులు తప్పని సరిగా మాస్క్ ధరించి… భౌతిక దూరం పాటించాలని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గం చెప్పారు.

ప్రవేశ రుసుము రూ. 30 గా నిర్ణయించామని… కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 1500 స్టాళ్లకు అనుమతి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. 46 రోజుల పాటు కొనసాగే ఎగ్జిబిషన్ లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహం 3గంటల వరకు సందర్శకులను వాహానాలతో అనుమతిస్తామని… కారుకు రూ.600, ఆటోకు రూ.300, ద్విచక్రవాహనానికి రూ.100 రుసుముగా నిర్ణయించామని చెప్పారు. వాహానదారులు మైదానమంతా తిరుగుతూ వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.