Telangana Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. 14 జిల్లాలకు ఎల్లో వార్నింగ్.. రాబోయే 3 గంటలు అత్యంత కీలకం
తెలంగాణ(Telangana Rains)లోని 14 జిల్లాలకు వాతావరణ శాఖ (IMD) ఎల్లో వార్నింగ్ జారీ చేసింది.
India Meteorological Department has issued yellow warning for 14 districts in Telangana
-
తెలంగాణలో 14 జిల్లాలకు అలర్ట్.
-
సాయంత్రం వరకు వర్షాలు కురుస్తాయి.
-
ఈదురుగాలులతో ఉరుములు వచ్చే అవకాశం.
Telangana Rains: తెలంగాణలోని 14 జిల్లాలకు వాతావరణ శాఖ (IMD) ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. రానున్న 2 నుండి 3 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఆదిలాబాద్, జనగాం, కరీంనగర్, మహబూబ్నగర్, ములుగు, నాగర్కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు ఈ వర్ష పరిస్థితులు కొనసాగనున్నాయి.
AP Rains: ఏపీ ప్రజలకు హై అలర్ట్.. రెండు రోజులపాటు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
ప్రజలకు వాతావరణ శాఖ సూచనలు:
ఈ వర్షాల(Telangana Rains) సమయంలో గంటకు 40 కిలోమీటర్ల లోపు వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అకస్మాత్తుగా మారే ఈ వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు, రైతులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో బయట తిరగకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, వర్ష సూచన ఉన్న జిల్లాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
