Telangana Vahan Portal : వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఫోన్ నంబర్, ఈ-మెయిల్ అప్‌డేట్ చేయకపోతే ఇబ్బందులే..

Hyderabad Police Vahan Portal Update : వాహన యజమానులు తమ వివరాలను వెంటనే అప్‌డేట్ చేసుకోవడం ద్వారా పెండింగ్ చలానాలు పెరగకుండా చూసుకోవచ్చని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.

Hyderabad Police Vahan Portal Update

Hyderabad Police Vahan Portal Update : తెలంగాణలోని వాహనదారులకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. మీ వాహనానికి సంబంధించిన ట్రాఫిక్ ఉల్లంఘన ఈ-చలానాలు, నోటీసులు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని సకాలంలో అందుకోవాలంటే వెంటనే వాహన్ పోర్టల్ (Vahan Portal)లో మీ ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీలను తప్పనిసరిగా అప్డేట్ చేయాలని సూచించారు.

Also Read : Electric Two Wheeler Star Ratings : వావ్.. సూపర్.. ఇక నుంచి కారు టైప్‌లో టూ వీలర్స్‌కి కూడా రేటింగ్స్..!

పాత మొబైల్ నంబర్లు లేదా ఈ-మెయిల్ ఐడీలు నమోదై ఉంటే ట్రాఫిక్ చలానాలు, ఇతర నోటిఫికేషన్లు అందకపోయే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. దీంతో చలానాలు పెండింగ్‌లో పడటమే కాకుండా, వాహనదారులు అనవసర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. వాహనాలకు సంబంధించిన అన్ని సమాచారాన్ని సకాలంలో అందుకునేందుకు వాహన్ పోర్టల్‌లో తాజా వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. చలానాలు లేదా నోటీసులు అందలేదని చెప్పేందుకు ఇకపై అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

వాహనదారులు తమ మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ వివరాలను సులభంగా అప్డేట్ చేసుకునేందుకు ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులో ఉంచారు. వాహన్ పోర్టల్ లోకి వెళ్లి అవసరమైన వివరాలను నమోదు చేయొచ్చు. అంతేకాక.. సంబంధిత శాఖ విడుదల చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా కూడా వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ అప్డేట్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు పేర్కొన్నారు.