Hyderabad Hotel (Photo : Google)
Hyderabad Hotel : హైదరాబాద్ లో అత్యంత దారుణం జరిగింది. ఎక్స్ ట్రా పెరుగు అడిగాడని కస్టమర్ ను కొట్టి చంపారు హోటల్ సిబ్బంది. పంజాగుట్టలోని మెరిడియన్ హోటల్ లో ఈ ఘోరం జరిగింది. మృతుడిని లియాకత్ గా గుర్తించారు.
తీవ్ర సంచలనం రేపిన ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. లియాకత్ పై దాడి చేసిన ఐదుగురు హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్స్ ట్రా పెరుగు అడిగినందుకు కస్టమర్ లియాకత్ పై హోటల్ సిబ్బంది దాడికి దిగారు. విచక్షణారహితంగా కొట్టారు. హోటల్ సిబ్బంది దాడిలో లియాకత్ ఊపిరాడక చనిపోయాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఇక, ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం బయటపడింది. దీంతో ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ ను ఇప్పటికే సస్పెండ్ చేశారు సీపీ సీవీ ఆనంద్.
కాగా, బిర్యానీలో అదనంగా పెరుగు ఇవ్వాలని అడగటమే లియాకత్ పాలిట మృత్యువైంది. హోటల్ సిబ్బంది అతడిని దారుణంగా కొట్టారు. ఆ తర్వాత బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తనకు ఊపిరి ఆడటం లేదని పాపం బాధితుడు వాపోయాడు. అయినా ఆ దుర్మార్గులు కనికరం చూపలేదు. పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆసుపత్రికి తీసుకెళ్లకుండా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో లియాకత్ పోలీస్ స్టేషన్ లోనే కుప్పకూలాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. లియాకర్ మరణించాడు. కాగా, పోలీసుల సమక్షంలోనూ హోటల్ సిబ్బంది రెచ్చిపోయారని, లియాకత్ ను చితకబాదారని అతడి కుటుంబసభ్యులు వాపోయారు. లియాకత్ మృతితో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సెప్టెంబర్ 10వ తేదీన రాత్రి 11గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది.
Also Read..Nepali Woman Killed : పెళ్లి చేసుకోవాలని అడిగిన నేపాలీ మహిళను హత్య చేసిన ఆర్మీ అధికారి
కాగా, ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. తనకు ఊపిరి ఆడటం లేదని బాధితుడు మొరపెట్టుకున్నా పోలీసులు కనికరం చూపలేదు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆసుపత్రికి బదులుగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కాలయాపన చేశారు. దాంతో లియాకత్ చనిపోయాడు. సరైన సమయంలో బాధితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించి ఉంటే లియాకత్ బతికేవాడని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.