Puranapool Crow Incident : సిటీలో బలగం సీన్ రిపీట్.. పిండం ముట్టేందుకు కాకి రాలేదు.. ఏం చేశారో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది
Puranapool Crow Incident : హైదరాబాద్ నగరంలో బలగం సీన్ రిపీట్ అయ్యింది.
- Dharani Pilli
- Updated on- April 21, 2026 / 10:23 AM IST
hyderabad puranapool crematorium family bought crow to complete funeral rituals
Puranapool Crow Incident : తెలంగాణ సమాజంలో కాకి పిండం ముట్టడం ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో ‘బలగం’ సినిమా ద్వారా అందరికీ తెలిసి వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో కాకులు రాకపోవడంతో.. కుక్క, ఆవు ముట్టినా పర్లేదు అని సరిపెట్టుకుంటున్నారు. కానీ తాజాగా హైదరాబాద్ నగరంలోని ఓ ప్రాంతంలో మాత్రం విచిత్రమైన సంఘటన వెలుగు చూసింది. పిండం ముట్టేందుకు ఎంత సేపు ఎదురు చూసినా కాకి రాలేదు. దీంతో వారు సరికొత్తగా ఆలోచించారు. ఏకంగా కాకిని కొనుక్కొచ్చి.. పిండం ముట్టించారు. ఈ వింత సంఘటన పాతబస్తీ పురానాపూల్ శ్మశానవాటికలో ఆదివారం వెలుగు చూసింది.
పురానాపూల్ హిందూ శ్మశానవాటికలో చనిపోయిన తమ కుటుంబ సభ్యుడికి కర్మకాండ జరిపించి పిండం పెట్టారు. కానీ ముట్టడానికి కాకులు రాలేదు. అసలు గ్రామాల్లోనే కాకులు కావ్ మనడం లేదు.. ఇక ఈ వేడిలో పట్టణాల్లో కాకులను చూడటం అరుదే. అందుకే వారు గంటల తరబడి ఎదురుచూసినా ప్రయోజనం లేకపోయింది. ఒక్క కాకి కూడా రాలేదు.
దీంతో చేసేదేం లేక సమీపంలో ఉన్న ముర్గీచౌక్‌కు వెళ్ళి ఓ కాకిని కొనుక్కుని వచ్చారు. దాని కాళ్లను దారంతో కట్టి, ఆహారం, నీళ్ళు అందించిన తర్వాత పిండాన్ని ముట్టించారు. ఈ సంఘటనను తిలకించిన వారు ఆశ్చర్యానికి గురయ్యారు.
