Rotten Chicken: హోటళ్లు, రెస్టారెంట్లలో చికెన్ తింటున్నారా? బీకేర్ ఫుల్.. 352 కేజీల కుళ్లిన చికెన్ సీజ్.. ఇది తింటే చావే..!
ఈ తనిఖీల్లో దాదాపు 352 కేజీల కుళ్లిన చికెన్ గుర్తించారు. కుళ్లిన చికెన్ ను స్థానికంగా ఉన్న రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లయ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
- Naveen
- Published On : March 28, 2026 / 12:00 AM IST
Rotten Chicken: హైదరాబాద్ చికెన్ సెంటర్లలో మార్పు కనిపించడం లేదు. నగరంలో ఎక్కడో ఒక చోట కుళ్లిన చికెన్ సరఫరా చేస్తూనే ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసినా, కేసులు పెట్టినా నిర్వాహాకుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. తాజాగా మూసాపేట భరత్ నగర్ లోని ఎస్ పీఆర్ చికెన్ సెంటర్ లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆకస్మికంగా తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో భారీగా కుళ్లిన చికెన్ పట్టుబడింది. దాదాపు 352 కేజీల కుళ్లిన చికెన్ ను సీజ్ చేశారు. ఈ కుళ్లిన చికెన్ ను స్థానికంగా ఉన్న రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లయ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సూరజ్ పాల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని సనత్ నగర్ పోలీసులకు అప్పగించారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది.
ఇటీవల సికింద్రాబాద్ లోని ఓ చికెన్ మార్ట్ లోనూ ఇదే తరహాలో భారీగా కుళ్లిన మాంసం పట్టుబడిన సంగతి తెలిసిందే. ఏకంగా 610 కిలోల కుళ్లిన మాంసాన్ని సీజ్ చేశారు అధికారులు. ఇప్పుడు కుళిన చికెన్ వెలుగుచూసింది.
ఈ క్రమంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చికెన్, మాంసం తినే వారు జాగ్రత్తగా ఉండాల్సిందే అంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తింటే అనారోగ్యం బారిన పడి ఆసుపత్రి పాలు కావడం ఖాయం అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే ప్రమాదం కలగొచ్చని హెచ్చరించారు. అందుకే ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేని హోటల్స్ లో నాన్ వెజ్ పదార్దాలు తినకపోవడమే బెటర్ అని సూచిస్తున్నారు.
Also Read: ట్యాంకర్‌లలో నీటిని బుక్ చేసే వారికి జల మండలి కీలక అలర్ట్.. అలాంటి వారంతా జైలుకే
