Hyderabad to Basara : బాసర వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. నో ట్రాఫిక్ టెన్షన్.. హైదరాబాద్ నుంచి కొత్త రూట్ ఇదే..!
Hyderabad to Basara : హైదరాబాద్ నుంచి బాసర సరస్వతి ఆలయానికి వెళ్లేందుకు కొత్త ప్రత్యామ్నాయ రూట్ అందుబాటులో ఉంది. సంగారెడ్డి, జోగిపేట, పిట్లం మీదుగా వెళ్లే మార్గం వివరాలు, ప్రయాణ దూరం, సమయం తెలుసుకోండి.
- Sreehari A
- Published on- November 14, 2026 / 04:23 PM IST
Hyderabad to Basara in Just 3 Hours ( Image credit : AI )
- హైదరాబాద్ నుంచి బాసరకు 3 గంటలే ప్రయాణం
- NH-44కు మరో ప్రత్యామ్నాయ మార్గం
- బాసరకు సంగారెడ్డి మీదుగా కొత్త రూట్
Hyderabad to Basara : బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వెళ్లాలనుకునే హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్. ఇకపై బాసరకు వెళ్లాలంటే గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. హైదరాబాద్ నుంచి బాసరకు వెళ్లేందుకు మరో ప్రత్యామ్నాయ రూట్ అందుబాటులో ఉంది. ఈ మార్గంలో ప్రయాణిస్తే సాధారణ ట్రాఫిక్ పరిస్థితుల్లో 3 నుంచి 4 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు.
NH-44కు ప్రత్యామ్నాయంగా కొత్త రూట్ :
ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి బాసరకు వెళ్లాలంటే చాలామంది NH-44 మార్గాన్నే ఎంచుకునేవారు.. మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా బాసరకు చేరుకునేవారు. అయితే, వీకెండ్స్, పండుగలు, సెలవు రోజుల్లో ఈ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రయాణ సమయం కూడా పెరుగుతుంది. ఈ ఇబ్బందులను తప్పించుకోవాలనుకునే వారికి సంగారెడ్డి మీదుగా వెళ్లే మార్గం మరో ఆప్షన్..
సంగారెడ్డి మీదుగా ఎలా వెళ్లాలంటే? :
హైదరాబాద్ నుంచి బయలుదేరి పటాన్‌చెరు మీదుగా NH-161 హైవేపైకి వెళ్లాలి. అక్కడి నుంచి సంగారెడ్డి, జోగిపేట, పిట్లం మీదుగా ప్రయాణించాలి. అనంతరం NH-161BB రహదారిపైకి వెళ్లి మద్నూర్, బోధన్ మీదుగా బాసరకు చేరుకోవచ్చు. ఈ మార్గంలో దూరం సుమారు 200 కిలోమీటర్లు ఉండొచ్చని అంచనా..
సమయం ఆదా ఎంతంటే? :
ఈ కొత్త ప్రత్యామ్నాయ మార్గంలో సాధారణ ట్రాఫిక్ ఉంటే 3 గంటల నుంచి 4 గంటల్లో బాసరకు చేరుకోవచ్చు.. అదే పాత NH-44 మార్గంలో సుమారు 220 నుంచి 230 కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావచ్చు. దీనికి 4.5 నుంచి 5 గంటల సమయం పట్టొచ్చు. పరిస్థితులను బట్టి కొత్త మార్గంలో గంట నుంచి 2 గంటల వరకు సమయం ఆదా అవుతుంది.
అయితే, రోడ్డు పరిస్థితులు, ట్రాఫిక్ రద్దీ, ప్రయాణ సమయాన్ని బట్టి ఈ లెక్కలు మారవచ్చు. అందుకే, బాసర ప్రయాణానికి బయలుదేరే ముందు గూగుల్ మ్యాప్స్‌లో లైవ్ ట్రాఫిక్, రూట్ పరిస్థితులను చెక్ చేసుకోవడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి అమ్మవారి దర్శనానికి వెళ్లేవారు ముందుగానే ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుంటే ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా బాసరకు చేరుకోవచ్చు..
