Vanasthalipuram Bank Of Baroda Cashier Theft Bank Cash For Cricket Betting
vanasthalipuram bank of baroda cashier Praveen kumar theft bank : హైదరాబాద్ లోని వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాషియర్ కేసులో ట్విస్ట్‌లు మీద ట్విస్ట్‌లు బయటపడుతున్నాయి. డబ్బులు తానే తీసుకెళ్లానని..క్రికెట్ బెట్టింగ్ లో పెట్టి నష్టపోయానని..మళ్లీ బెట్టింగ్ లో పెడతానని అవి వస్తే డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అంటూ బ్యాంకు మేనేజర్ కు క్యాషియర్ ప్రవీణ్ కుమార్ మెసేజ్ చేసాడు. కానీ తాజాగా బ్యాంకునుంచి డబ్బులు తాను తీసుకెళ్లలేదంటూ క్యాషియర్ ప్రవీణ్ సెల్ఫీ వీడియో పంపాడు.
డబ్బు తానే తీసుకెళ్లినట్లు ప్రవీణ్ ఒప్పుకున్న ప్రవీణ మరో సారి ట్విస్ట్ ఇచ్చాడు.తాను బెట్టింగ్ లో డబ్బు కోల్పోయానని మెసేజ్ పెట్టాడు. అయితే ఈరోజు తాను డబ్బు తీయలేదంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. బ్యాంకులో నగదు లావాదేవీల్లో తక్కువగా వచ్చిన నగదును తనపై పడేస్తున్నారని…. బ్యాంకు మేనేజర్, సిబ్బంది పట్టించుకోవడం లేదని వాపోయాడు. గతంలోనూ పలుమార్లు నగదు తక్కువగా ఉండటంపై నిలదీసినా మేనేజర్ పట్టించుకోలేదని తెలిపాడు.
బ్యాంకు మేనేజర్ వినయ్ కుమార్ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరుగుతోందని, అనవసరంగా తనను బ్లేమ్ చేస్తున్నారని ఆరోపించాడు. బ్యాంకులో సరైన నిఘా లేదని క్యాషియర్ ప్రవీణ్ సెల్ఫీ వీడియోలో తెలిపాడు. ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తు అటు బ్యాంకు సిబ్బందిని ఇటు పోలీసులను నానా తిప్పలు పెడుతున్నాడు ప్రవీణ్ కుమార్.
కాగా..వనస్థలిపురం పరిధిలోని సాహెబ్ నగర్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో రెండు రోజుల క్రితం డబ్బు మాయమైంది. 22 లక్షల 53 వేల రూపాయల నగదు తీసుకుని క్యాషియర్ ప్రవీణ్ కుమార్ పరారయ్యాడు. రోజులాగే డ్యూటికి వచ్చాడు ప్రవీణ్ కుమార్. కొంతసేపటి తర్వాత తనకు కడుపునొప్పి వస్తుందని మేనేజర్ కు చెప్పాడు. టాబ్లెట్స్ తెచ్చుకుంటానని బయటికి వెళ్లాడు. తర్వాత తిరిగి బ్యాంక్ కు రాలేదు. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో బ్యాంక్ క్లోజ్ చేసి సమయంలో మేనేజర్ అకౌంట్స్ చెక్ చేశాడు. నగదులో 23 లక్షలు తక్కువ వచ్చినట్టు తేలింది. దీంతో క్యాషియర్ కి మేనేజర్ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప్రవీణ్ కుమార్ స్పందించక పోవడంతో.. బ్యాంక్ చీఫ్ మేనేజర్ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా మేనేజర్ కు క్యాషియర్ ప్రవీణ్ కుమార్ చేసిన మెసేజ్ విషయం వెలుగులోకి వచ్చింది.