లండన్‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన హైదరాబాద్ మహిళ

ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు లండన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ దిల్ సుఖ్‌నగర్‌ సమీపంలోని మారుతి నగర్‌కు చెందిన హిమ బిందు.. ఉద్యోగ రీత్యా లండన్‌కు వెళ్లి, అక్కడే ఉంటోంది. ఆమె అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆమెను ఓ ట్రక్‌ ఢీకొట్టింది. దీంతో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది హిమ బిందు.

ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హిమ బిందు ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమెకు జరిగిన యాక్సిండెట్‌ గురించి అధికారులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ఉద్యోగం కోసం లండన్‌కు వెళ్లిన తమ అమ్మాయికి యాక్సిడెంట్‌ కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిమ బిందుకు జరిగిన రోడ్డు ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

యాదాద్రి పేరుని యాదగిరి గుట్టగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం..