Hydra Demolitions In Khajaguda : ఇయర్ ఎండింగ్ లో మరోసారి కొరడా ఝళిపించింది హైడ్రా. ఖాజాగూడ భగీరధమ్మ చెరువులో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. బఫర్ జోన్ లో నిర్మించిన 20కి పైగా దుకాణాలను తొలగించారు. కూల్చివేతలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖాజాగూడ చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లోని ఆక్రమణలపై హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు.
ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లోని 9.07 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు..
ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లోని 9.07 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగించారు. ఖాజాగూడ భగీరధమ్మ చెరువు ఆక్రమణలపై స్థానికులు చేసిన ఫిర్యాదుపై స్పందించారు హైడ్రా అధికారులు. అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఇవాళ కూల్చివేతలకు దిగారు. మరోవైపు నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే కూల్చివేతలపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : సీఎంతో మీటింగ్ పై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరం.. FDC చైర్మన్ హోదాలో దిల్ రాజు ట్వీట్ వైరల్..
తక్కువ సమయంలో షాపులను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారులు ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న నిర్మాణాలను ఎలా కూల్చివేస్తారంటూ ఆందోళనకు దిగారు.
చెరువుల పరిరక్షణపై స్పెషల్ ఫోకస్..
హైదరాబాద్ నగరంలో ఉండే చెరువుల పరిరక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన హైడ్రా అధికారులు.. చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. కాగా, నివాసాలను ఏర్పాటు చేసుకుని అందులో ఎవరైనా నివాసం ఉంటే మాత్రమే అలాంటి కట్టడాలను కూల్చివేయరు. ఎవరూ నివాసం లేరంటే కూల్చివేయాలని నిర్ణయించారు. ఖాజాగూడలోని భగీరధమ్మ చెరువు దగ్గర 20కి పైగా దుకాణాలు వెలిశాయి.
సర్వే నెంబర్ 18లో ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న 9 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు వెలిసినట్లుగా అధికారులు గుర్తించారు. నిన్న నోటీసులు ఇచ్చిన అధికారులు ఇవాళ కూల్చివేశారు. అయితే, వారంతా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు. షాపులను కూల్చేయడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : న్యూఇయర్ వేడుకల వేళ.. ప్రజలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక సూచన