YS Vijayamma : వాస్తవాలను చూపించండీ, పోలీసులు చేసింది కూడా చూపించండీ : మీడియాకు విజయమ్మ విజ్ఞప్తి

YS Vijayamma

YS Vijayamma : వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పలు నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లిహిల్స్ పీఎస్ కు తరలించారు. పోలీసులను నెట్టివేస్తు ఓ మహిళ కానిస్టేబుల్ మీద, ఓ ఎస్సై పైనా షర్మిల చేయి చేసుకున్నారనే షర్మిల దురుసుగా ప్రవర్తించారనే వివాదం కొనసాగుతున్న క్రమంలో కుమార్తె షర్మిల కోసం వైఎస్ విజయమ్మ పీఎస్ కు వచ్చారు. పోలీసులు విజయమ్మను షర్మిలను చూడకుండా అడ్డుకున్నారు.దీంతో విజయమ్మ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.ఈక్రమంలో ఆమె కూడా పోలీసులపై చేయి చేసుకున్నారు. ఇలా తల్లీ కుమార్తెలిద్దరు పోలీసులపై చేయి చేసుకున్నారనే వివాదం జరుగుతోంది.

కానీ ఇవేవీ వాస్తవాలు కాదని వైఎస్ విజయమ్మ మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. మీడియా వాస్తవాలను చూపించాలని నేను గానీ షర్మిల గానీ పోలీసులపై చేయిచేసుకోలేదని కేవలం చేయి పోలీసులకు తగిలిందని అంతే తప్ప అది కొట్టటం కాదని విజయమ్మ తెలిపారు. కొట్టాలంటే ఎంత గట్టిగా అయినా కొట్టవచ్చని కానీ మా ఉద్ధేశ్యం అదికాదన్నారు. మీడియా షర్మిల ప్రవర్తనేచూపిస్తోంది గానీ పోలీసులు ఆమె పట్ల వ్యవహరించిన ఘటనలను చూపించటంలేదని మీడియా అంటే వాస్తవాలను చూపించేదని అటువంటి మీడియా వాస్తవాలనే చూపించాలని మీడియాకు చేతులెత్తి మొక్కుతున్నానని విజ్ఞప్తి చేశారు విజయమ్మ.

YS Sharmila: నా మీద పడితే నేను భరించాలా? నా రక్షణకోసం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం నా బాధ్యత..

కానీ ఓ మహిళా పోలీసుపై విజయమ్మ చేయి చేసుకున్నట్లుగా ప్రత్యక్షంగా కనిపించింది.జూబ్లీహిల్స్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగాక విజయమ్మ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా వాస్తవాలను చూపించాలని షర్మిల పట్ల పోలీసులు ప్రవర్తనను పక్కన పెట్టి ఆమె పోలీసులపై చేయి చేసుకుందని ప్రత్యేకించి ఫోకస్ చేసి చూపించటం సరైందికాదన్నారు. మీడియా షర్మిల పక్కన ఉండి మాట్లాడకపోయినా ఫరవాలేదుగానీ ప్రజల తరపున నిలబడాలని సూచించారు. ఈ సందర్భంగా మీడియాకు చేతులెత్తి మొక్కుతున్నాను నా బిడ్డ ప్రజల కోసం పోరాడుతోంది..అటువంటి ఆమె పట్ల ఇటువంటి వార్తలు ప్రసారం చేయటం తగదు అన్నారు.

షర్మిలమ్మ బయటకు వెళ్లకుండా పోలీసులు భారీగా వచ్చి అడ్డుకున్నారని షర్మిలమ్మ డ్రైవర్ ని కొట్టారని షర్మిల ఏ కార్యక్రమాలు చేసిన అడ్డుకోవటమే కాదు ఇష్టమొచ్చినట్లుగా లాగిపారేస్తారని కానీ పోలీసులది తప్పు అని మీడియా చూపించదని ఆరోపించారు. కానీ షర్మిలమ్మ కేవలం చేయి తగినంతమాత్రానా ఆమె పోలీసులపై చేయి చేసుకుందని ఇలా మా చేతులు అలా అంటేనే మేము పోలీసుల్ని కొట్టామని మీడియా రాద్దాంత చేస్తోందని కానీ పోలీసులది తప్పు అని మాత్రం చూపించట్లేదని మీడియాపై కూడా విజయమ్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులను కొట్టాలని ఉద్ధేశం షర్మిలకు నాకు కూడా లేదని పోలీసులు, ప్రభుత్వం అంతా కలిసి పనిచేయాలని కానీ ఇటువంటి అవాస్తవాలని మీడియా చూపించవద్దని దుష్ప్రచారం చేయవద్దని కోరారు. ప్రజల కోసం నా బిడ్డ పోరాడుతోంది. అటువంటి పోరాటానికి సహకరించండీ అని విజ్ఞప్తి చేశారు విజయమ్మ.

YS Sharmila Arrested : పోలీసుల్ని నెట్టేసి .. మహిళా కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించిన షర్మిల

ప్రభుత్వంపై పోరాటం చేస్తోందనే షర్మిలను వేధిస్తున్నారని.. షర్మిల వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరిస్తున్నారని విజయమ్మ మండిపడ్డారు. షర్మిల ఎక్కడకీ వెళ్లకూడదా? అని ప్రశ్నించారు. షర్మిల డ్రైవర్ పై కూడా దాడి చేశారని.. తెలంగాణలో వైఎస్ రాజశేఖరెడ్డి ఆశయాల సాధన కోసమే షర్మిల పార్టీ పెట్టిందని అటువంటి ఆమెపై ఎందుకీ కక్షపూరిత దాడులు అని ప్రశ్నించారు.
షర్మిల సిట్ ఆఫీసుకు వెళితే తప్పేంటీ?ఏం చేసిందని అరెస్ట్ చేశారు? అన్యాయంగా అరెస్ట్ చేశారని అసలు ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేని స్థితిలో పోలీసులు ఉన్నారని విజయమ్మ ఆగ్రహం వ్యక్తంచేశారు.  కాగా పోలీస్ స్టేషన్ లో ఉన్న భార్య షర్మిలను చూడటానికి వచ్చారు బ్రదర్ అనిల్ కుమార్. అనంతరం భార్యను పరామర్శించారు.

YS Sharmila Arrested : షర్మిల కోసం విజయమ్మ .. పోలీసులతో వాగ్వాదం, తోపులాట