Komatireddy Venkat Reddy (Photo : Twitter)
Komatireddy Venkat Reddy : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మరో మైలురాయి అందుకుంది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గుమ్మడివెల్లి వద్ద భట్టి విక్రమార్క యాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 1000 కిలోమీటర్ల పాదయాత్రకు గుర్తుగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి జగదీశ్ రెడ్డిపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
Also Read..Bandi Sanjay : బీఆర్ఎస్ ను ధైర్యంగా ఎదుర్కొనే పార్టీ బీజేపీనే : బండి సంజయ్
”నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. హత్యా రాజకీయాల నుండి వచ్చిన హంతక నేపథ్యం. నాగారంలో కిరాయి హంతకుడివి. తినడానికి తిండి లేని నీవు అక్రమంగా కోట్లకు పడగలెత్తి.. భట్టి పాదయాత్రపై విమర్శలు చేస్తావా? మా భట్టిలాగా ఓ 10 రోజులు నడువు. మీ చరిత్ర విప్పుతాం” అంటూ మంత్రి జగదీశ్ రెడ్డిపై నిప్పులు చెరిగారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టి.. రైతులకు ఉపయోగపడే నక్కలగండి సొరంగం మరిచిన అసమర్థుడు సీఎం కేసీఆర్ అని కోమటిరెడ్డి విమర్శించారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.