CM Revanth Reddy : రెండోసారి కూడా నేనే ముఖ్యమంత్రి అవుతా : సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : రెండోసారి కూడా తానే సీఎం అవుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. లబ్ధిదారులే మా ఓటర్లని, పని నమ్ముకునే ముందుకు వెళ్తున్నానంటూ చెప్పుకొచ్చారు.

CM Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రి అవుతానని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మొదటిసారి బీఆర్ఎస్‌పై వ్యతిరేకతతో మాకు ఓటేశారన్నారు. శాసనమండలి వాయిదా తర్వాత సీఎం రేవంత్ మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు.

Read Also : SIP Investments : మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతి నెలా జస్ట్ రూ.1000 ఆదా చేయండి.. 20 ఏళ్లలో రూ.10 లక్షలపైనే సంపాదించుకోవచ్చు!

‘‘మొదటిసారి బీఆర్ఎస్‌పై వ్యతిరేకతతో ఓటు వేసిన ప్రజలు రెండోసారి మాపై ప్రేమతో ఓటు వేస్తారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్లు. నేను పనిని నమ్ముకుని ముందుకు వెళుతున్నాను. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. స్టేచర్ కాదు స్టేట్ ఫ్యూచర్ నాకు ముఖ్యం.. రూ. 25 లక్షల పైచీలుకు రుణమాఫీ జరిగింది. ఒక్క కుటుంబంలో నలుగురు ఉన్నా రుణమాఫీ అందించాం.

లబ్ధిదారుల సంఖ్య కోటి దాటింది. కోటిమంది మహిళలకు కచ్చితంగా లబ్ధి చేకూరుస్తా. వారంతా ఇప్పుడు మాట్లాడకపోయినా ఓటు మాకే వేస్తారు . గతంలో నేను చెప్పిందే జరిగింది. భవిష్యత్తులో నేను చెప్పిందే జరుగుతుంది’’ అంటూ సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Read Also : Vijayasai Reddy : కోటరీ వదలదు, కోట కూడా మిగలదు.. జరిగేది ఇదే.. విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్..!

అంతేకాదు.. జనాభా లెక్కల గురించి జిల్లా జిల్లా కలెక్టర్లను కేంద్రం బడ్జెట్ అంచనాలు అడిగిందని చెప్పారు. 2026లో పూర్తి చేసి 2027లో జనాభా లెక్కలు నోటిఫై చేస్తారనే అంచనా ఉందని తెలిపారు. దీనికి అనుగుణంగా కేంద్రం డిలిమిటేషన్‌కు సమాయత్తమవుతోందని, అందుకే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా మా ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు.