×
Ad

Shejal : బెల్లంపల్లిలో గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తా, ఎలా గెలుస్తాడో చూస్తా- శేజల్ హాట్ కామెంట్స్

అతడొక కబ్జాకోరు, కామపిశాచి అని ఆమె ఆరోపించారు. ఎలా గెలుస్తాడో చూస్తానని శేజల్ సవాల్ విసిరారు. Shejal - Durgam Chinnaiah :

  • Published On : August 22, 2023 / 12:04 AM IST

Shejal - Durgam Chinnaiah

Shejal – Durgam Chinnaiah : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించడంపై ఫైర్ అయ్యారు బాధితురాలు శేజల్. దుర్గం చిన్నయకు టికెట్ ఇవ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏడు నెలలుగా దుర్గం చిన్నయకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని, కానీ తనకు న్యాయం జరగలేదన్నారు.

ఇవాళ్టితో న్యాయపోరాటంపై తనకు విశ్వాసం పోయిందన్నారు. దుర్గం చిన్నయ్య ఒక కబ్జాకోరు అని, కామపిశాచి అని ఆమె ఆరోపించారు. బెల్లంపల్లిలో ఆయన ఎలా గెలుస్తాడో చూస్తానని శేజల్ సవాల్ విసిరారు. లైంగిక వేధింపులు, అక్రమాలు, భూకబ్జాలపై బెల్లంపల్లిలో గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తానని చెప్పారు.

Also Read..Rekha Nayak : కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే..? అధికార పార్టీలో ఫస్ట్ లిస్ట్ ప్రకంపనలు

”దుర్గం చిన్నయ్యకు టికెట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. మరికొందరు అమ్మాయిలను వేధింపులకు గురిచేసేందుకు టికెట్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఉంది. దుర్గం చిన్నయ్య చేసిన తప్పులను నేను చూస్తూ ఊరుకోను. బెల్లంపల్లిలో ఎలా గెలుస్తాడో నేనూ చూస్తా. దుర్గం చిన్నయ్య చేసిన లైంగిక వేధింపులు, అక్రమాలు, భూకబ్జాలపై బెల్లంపల్లిలో గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తా” అని శేజల్ ఒక వీడియోలో తెలిపారు.