Gadala Srinivasa Rao
Gadala Srinivasa Rao politics : తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు రాజకీయ ప్రవేశంపై ఎట్టకేలకు కుండ బద్దలు కొట్టారు. సీఎం కేసీఆర్ అనుమతితో రాజకీయాలలోకి వస్తానని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి తప్పకుండా వస్తానని.. అది కూడా సీఎం కేసీఆర్ అనుమతితోనే వస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్ కొత్తగూడెం నుండి పోటీ చేయమని అనుమతి ఇస్తేనే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు.
కేవలం బీఆర్ఎస్ పార్టీ నుండి మాత్రమే పోటీ చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ బీ ఫామ్ ఇవ్వకుంటే వేరే ఏ పార్టీ నుండి పోటీ చేయనని చెప్పారు. తనకు ఇంకా ఏడు సంవత్సరాల ఉద్యోగ సర్వీస్ ఉంది.. పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఉద్యోగం చేసుకుంటానని వెల్లడించారు.
Bandi Sanjay : బీఆర్ఎస్ ను ధైర్యంగా ఎదుర్కొనే పార్టీ బీజేపీనే : బండి సంజయ్
అదేవిధంగా జీఎస్ఆర్ ట్రస్ట్ సేవలు కొనసాగుతాయన్నారు. ఈ మేరకు శనివారం హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం జనహితలో జరిగిన మీడియా చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
2023 ఎలక్షన్ లో కేసీఆర్ ఆదేశిస్తే కొత్తగూడెం నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని పేర్కొన్నారు. వనరులు పుష్కలంగా ఉన్న కొత్తగూడెంలో అభివృద్ధి అంతగా లేదంటూ గడల.. కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖను విడుదల చేశారు.