CM KCR : జాగ్రత్త.. పెద్ద ప్రమాదం పొంచి ఉంది, కాంగ్రెస్ వస్తే ఖతమే- సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ ని మళ్ళీ గెలిపించాలి. బీఆర్ఎస్ పార్టీకి కులం మతం అనే భేదాలు లేవు. అందరి బాగు కోసం మ్యానిఫెస్టో విడుదల చేశాము. CM KCR

CM KCR Slams Congress (Photo : Facebook)

CM KCR Slams Congress : కాంగ్రెస్ పార్టీతో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, పొరపాటున కానీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే పెద్ద ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ వస్తే ధరణి రద్దు చేస్తాం అంటున్నారు ధరణి పోతే మళ్ళీ అన్నదాతలు కొట్లాటలు వస్తాయి, అవినీతి వస్తుంది అని కేసీఆర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వొద్దు అని ప్రజలకు పిలుపునిచ్చారు కేసీఆర్.

నిన్న కరవు, నేడు పాడి పంటలతో సస్యశ్యామలం…
”కరవుతో ఉన్న భువనగిరిలో ఇవాళ అద్భుతమైన పంటలు పండిస్తున్నారు. ఈ జిల్లాకు యాదాద్రి భువనగిరి అని లక్ష్మీనరసింహస్వామి పేరు పెట్టుకున్నాం. ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైన ఈ ప్రాంతంలో అద్భుతంగా అభివృద్ధి జరిగింది. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి అద్భుతమైన అభివృద్ధి చేశారు.
మళ్ళీ గెలిచేది శేఖర్ రెడ్డినే. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మిస్తున్న బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా త్వరలోనే నీళ్లు అందిస్తాం. ధరణి ద్వారా రైతుల కష్టాలు పోయాయి.

Also Read : 45 రోజులు మా కోసం పని చేయండి, ఐదేళ్లు మేము మీకోసం చేస్తాం : కేటీఆర్

కాంగ్రెస్ వస్తే కరెంట్ మాయం..
అన్నదాతలు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వస్తే ధరణి రద్దు చేస్తాం అంటున్నారు. ధరణి పోతే మళ్ళీ అన్నదాతల కొట్లాటలు వస్తాయి. అవినీతి వస్తుంది. కాంగ్రెస్ వస్తే కరెంట్ మాయం అవుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 3 గంటలు కరెంట్ ఇస్తాం అంటున్న కాంగ్రెస్ కు షాక్ ఇవ్వాలి. భువనగిరిలో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తాం. నాకున్న సర్వే ప్రకారం 50వేల మెజార్టీతో భువనగిరిలో ఫైళ్ల శేఖర్ రెడ్డి గెలవబోతున్నారు. పొన్నాల లక్ష్మయ్య అనే నాయకుడు తెలంగాణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ లోకి వచ్చారు.

Also Read : BRS ముఖ్యనేతల పోటీ స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్‌, వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి అడుగులు

మళ్లీ మమ్మల్నే గెలిపించాలి..
బీఆర్ఎస్ ని మళ్ళీ గెలిపించాలి. బీఆర్ఎస్ పార్టీకి కులం మతం అనే భేదాలు లేవు. అందరి బాగు కోసం మ్యానిఫెస్టో విడుదల చేశాము. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. యాదాద్రిలో భూముల రేట్లు అమాంతం పెరిగాయి. అందరికీ సన్న బియ్యం అందిస్తాం. అన్నదాతలకు 24 గంటల కరెంట్ ఉండాలంటే బీఆర్ఎస్ మాత్రమే గెలవాలి” అని సీఎం కేసీఆర్ అన్నారు.