Amit Shah : బీఆర్ఎస్ కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్లే : అమిత్ షా

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కేసీఆర్ సర్కారే కారణమని విమర్శించారు. సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.

Amit Shah

Amit Shah – BRS : బీఆర్ఎస్ కు ఓటేస్తే ఎంఐఎంకు ఓటు వేసినట్లేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే మతోన్మాద శక్తులకు అవకాశం ఇచ్చినట్లేనని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి, అరాచకం రాజ్యమేలుతోందని విమర్శించారు. పేపర్ లీకేజీలు పెరిగాయని చెప్పారు. నిరుద్యోగం పెరుగుతోందన్నారు.

శనివారం పటాన్ చెరు, ఖైరతాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కేసీఆర్ సర్కారే కారణమని విమర్శించారు. సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.

Harish Rao : కాంగ్రెస్ కు ఓటేస్తే కరెంట్ మాయం.. తెలంగాణ కుక్కలు చింపిన విస్తరాకే : మంత్రి హరీష్ రావు

బీజేపీ గెలిస్తే నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు కచ్చితంగా వస్తాయని తెలిపారు. బీజేపీ గెలిస్తేనే దేశానికి భద్రత అని అన్నారు. రామమందిరం నిర్మాణం బీజేపీతోనే సాధ్యమైందన్నారు. కాశ్మీర్ ను కాపాడుకున్నామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు