Black Fungus : బ్లాక్ ఫంగస్ కు చవక ట్యాబ్లెట్..అభివృద్ధి చేసిన హైదరాబాద్ ఐఐటీ

కోవాగ్జిన్, 2డీజీ డ్రగ్ తరహాలో....హైదరాబాద్ మరో ఔషధం తయారీకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారబోతోంది. ప్రస్తుతం దేశాన్ని గడగడలాడిస్తున్న బ్లాక్ ఫంగస్‌కు అత్యంత చవకైన ఔషధం అందుబాటులోకి తెస్తున్నారు హైదరాబాద్ ఐఐటీ పరిశోధకులు.

IIT Hyderabad : కోవాగ్జిన్, 2డీజీ డ్రగ్ తరహాలో….హైదరాబాద్ మరో ఔషధం తయారీకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారబోతోంది. ప్రస్తుతం దేశాన్ని గడగడలాడిస్తున్న బ్లాక్ ఫంగస్‌కు అత్యంత చవకైన ఔషధం అందుబాటులోకి తెస్తున్నారు హైదరాబాద్ ఐఐటీ పరిశోధకులు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగిస్తున్న అంఫోటెరిసన్ బి ఇంజక్షన్‌నే ట్యాబెట్ల రూపంలో తయారు చేస్తున్నారు. ఇప్పటిదాకా ఈ ట్యాబ్లెట్లను కాలా అజర్ చికిత్సలో వాడేవారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు వీటిని ఉపయోగించేందుకు వీలుగా…ఈ ట్యాబ్లెట్లు ఫార్మా కంపెనీలు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు.. సాంకేతిక పరిజ్ఞానం అందించాలని హైదరాబాద్ ఐఐటీ నిర్ణయించింది.

ఈ ట్యాబ్లెట్లకు అత్యవసర వినియోగం కింద అనుమతి ఇవ్వాలని ఐఐటీ పరిశోధకులు కోరుతున్నారు. 60 మిల్లీ గ్రాములుండే ఒక్కో ట్యాబ్లెట్ ధర 200 రూపాయలుగా నిర్ణయించారు. రోగులపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపకుండా ఈ ట్యాబ్లెట్లు పని చేస్తాయని తెలిపారు. ఈ ట్యాబ్లెట్‌లో ఉండే… రకరకాల ఎంజైమ్‌ల తీవ్రత.. ఇంజక్షన్‌తో పోలిస్తే తక్కువస్థాయిలో ఉంటుంది. అయితే బ్లాక్ ఫంగస్ చికిత్సకు మాత్రం ఇవి అద్భుతంగా పని చేస్తాయని చెబుతున్నారు. బ్లాక్ ఫంగస్ కేసులు దేశంలో వేగంగా విస్తరిస్తుండడం, చికిత్స అత్యంత ఖరీదు కావడం, కావల్సినంతగా అంఫోటెరిసన్ బి ఇంజక్షన్లు అందుబాటులో లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో బ్లాక్ ఫంగస్‌ చికిత్సకు ట్యాబ్లెట్ అందుబాటులోకి రావడంపై హర్షం వ్యక్తమవుతోంది.

Read More : Corona Vaccine : నిమ్స్ లో వ్యాక్సిన్ పంపిణీ..అవకతవకలు, అనర్హులకు వ్యాక్సిన్ పంపిణీ

 

ట్రెండింగ్ వార్తలు