Student Missing In US : అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని అదృశ్యం

తెలంగాణ కు చెందిన 23ఏళ్ల యువతి నితీషా కందుల అమెరికాలో అదృశ్యమైంది. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ నుంచి ఆమె కనిపించకుండా పోయింది.

Nitheesha Kandula (File image)

Hyderabad student Nitheesha Kandula Missing In US : యూఎస్ లో ఉన్నత చదువుల నిమిత్తం వెళ్లిన వారు మిస్సింగ్, అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతున్న విషాదకర ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి ఘటన అమెరికాలో మరొకటి చోటుచేసుకుంది. తెలంగాణ కు చెందిన 23ఏళ్ల యువతి నితీషా కందుల అమెరికాలో అదృశ్యమైంది. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ నుంచి ఆమె కనిపించకుండా పోయింది. అమెరికా కాలమానం ప్రకారం గత శుక్రవారం రాత్రి నుంచి ఆమె అదృశ్యమైనట్లు ఆమె సన్నిహితులు పేర్కొన్నారు. ఆమె మొబైల్ కు కాల్ చేసినా కూడా స్పందించడం లేదని, దీంతో సాయం కోసం వాట్సాప్‌ ద్వారా ఆమె కుటుంబ సభ్యులు అభ్యర్థిస్తున్నారు. అదృశ్యమైన నితీషా కనిపిస్తే +91 80749 62618 నంబర్‌కు సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

&

 

Also Read : Pinnelli : పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు.. కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొద్దని ఆదేశం

ఇదిలాఉంటే.. అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీలో శాన్ బెర్నార్డినో (సీఎస్‌యూఎస్‌బీ) విద్యార్థిని నితీషా కందుల అనే హైదరాబాద్ విద్యార్థిని మే 30న లాస్ ఏంజెల్స్ లో కనిపించకుండా పోయారని సీఎస్‌యూఎస్‌బీ పోలీస్ చీఫ్ ఆఫ్ పోలీస్ జాన్ గుట్టీరెజ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నితీషా ఆచూకీ తెలిసిన వారు తమ చిరునామాకు తెలియజేయాలని కోరారు.


అమెరికాలోని చికాగోలో 25ఏళ్ల తెలంగాణ విద్యార్థి అదృశ్యమయిన విషయం తెలిసిందే. రూపేష్ చంద్ర చింతకింది అనే విద్యార్థి విస్కాన్సిన్ లోని కాంకోర్డియా యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. అంతకుముందు అమెరికాలోని క్లీవ్ ల్యాండ్ నగరంలో 25ఏళ్ల హైదరాబాద్ విద్యార్థి మహ్మద్ అబ్దుల్ అర్పాత్ కూడా అదృశ్యమయ్యాడు. అనంతరం శవమై కనిపించాడు.