Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. లాటరీలో ఎంపికైన వారికి అసలు పరీక్ష ఇప్పుడే!

Indiramma Houses : గత పదేళ్లుగా అదే నియోజకవర్గంలో ఉంటున్నారా? అన్ని అర్హతలు ఉన్నాయా? అనే పూర్తి వివరాలను హౌసింగ్ బోర్డు అధికారులు చెక్ చేయనున్నారు. ఈ పరిశీలన కోసం ప్రత్యేక టీమ్‌లను కూడా ఏర్పాటు చేశారు.

Indiramma Houses

  • ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
  • లబ్ధిదారులకు త్వరలోనే ఇళ్ల మంజూరు
  • ప్రతి లబ్ధిదారుడి ఇంటికి ప్రత్యేక బృందాలు

Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల కోసం చూసేవారికి బిగ్ బ్రేకింగ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రాష్ట్ర ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది. ఇప్పటికే అర్హత పొందిన దరఖాస్తుదారుల్లో లాటరీ ద్వారా ఎంపికైన వారి వివరాలను అధికారులు ఫైనల్ చెక్ లిస్ట్ రెడీ చేయనున్నారు.

సెప్టెంబర్ 2 (బుధవారం) నుంచి ఎంపికైన లబ్ధిదారుల ఇళ్ల వద్ద క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ప్రారంభించనున్నారు. నగరంలోని మొత్తం 16 నియోజకవర్గాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించనున్నారు. అయితే, లాటరీలో ఎంపికైన ప్రతి లబ్ధిదారుడి ఇంటికి ప్రత్యేక బృందాలు వెళ్లనున్నాయి.

వారి దరఖాస్తులో ఇచ్చిన సమాచారం నిజమా? కాదా అనేది పరిశీలించనున్నారు. ముఖ్యంగా గత 10 ఏళ్లుగా సంబంధిత నియోజకవర్గ పరిధిలోనే వారు నివసిస్తున్నారా? లేదా స్థానికంగా ఉంటున్నారా? ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హతలు వారికి ఉన్నాయా లేదా అనే పూర్తి అంశాలను పరిశీలిస్తారు.

4 రోజుల్లో వెరిఫికేషన్ పూర్తి :
అధికారుల ప్లానింగ్ ప్రకారం.. 4 రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసేలా చర్యలు చేపట్టనున్నారు. ఒక్కో నియోజకవర్గంలో రోజుకు సుమారు 150 మంది లబ్ధిదారులను పరిశీలించనున్నారు. ఇందుకోసం నగరం వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే ఇందుకోసం ఇప్పటికే సంబంధిత సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది.

Read Also : Konda Surekha : ‘నాపై కాదు.. ముందు సీఎంపై చర్యలు తీసుకోండి’.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గానికి 480 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించారు. అదే సంఖ్యలో లబ్ధిదారులను కూడా లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఇప్పుడు వెరిఫికేషన్‌లో ఎవరైనా అనర్హులుగా తేలితే మాత్రం వారి స్థానంలో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారికి ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వెయిటింగ్ లిస్టును కూడా రెడీ చేశారు అధికారులు. కొన్ని నియోజకవర్గాల్లో ఈ లిస్టు 300 మందిని దాటింది.

ఇంటి వద్దనే తనిఖీలు :

దరఖాస్తులో ఇచ్చిన సమాచారం, కుటుంబ సభ్యుల వివరాలు, స్థానిక నివాస వివరాలు వంటి అంశాలను అధికారులు ముందుగా చెక్ చేస్తారు. ఆ తర్వాత లబ్ధిదారుల వివరాలను ప్రత్యేక యాప్‌లో రిజిస్టర్ చేయనున్నారు. ఆపై లబ్ధిదారుల ఇంటిని కూడా జియో ట్యాగ్ చేస్తారు.

ఇప్పటికే లాటరీలో ఎంపికైన వారి వివరాలను తెలంగాణ హౌసింగ్ బోర్డు (allotment objection portal)లో (https://tghb.telangana.gov.in/allotmentobjection) పొందుపరిచారు. ఇందులో పేరు, అప్లికేషన్ నంబర్, ఆధార్ నంబర్ ఆధారంగా వివరాలను చెక్ చేసుకోవచ్చు.

ఏవైనా అభ్యంతరాలు ఉంటే అదే పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆగస్టు 28 నుంచి ఆగస్టు 31 వరకు హైదరాబాద్‌లోని అన్ని నియోజకవర్గాల్లో లాటరీ ప్రాసెస్ పూర్తి కాగా 4 రోజుల ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది. ఇక ఫైనల్ లబ్ధిదారుల లిస్టును రెడీ చేయడమే ఆలస్యం..