×
Ad

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం.. విద్యార్థులు ఇవి గుర్తుంచుకోవాల్సిందే..

ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు సెంటర్ లోపలికి వెళ్లే ముందు ఎలాంటి సంతకం చేయాల్సిన అవసరం లేదని ఇంటర్ బోర్డు తెలిపింది.

Inter Exams 2026: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 25 నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. తెలంగాణ వ్యాప్తంగా 1,537 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు.

విద్యార్థులకు సూచనలు
ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు సెంటర్ లోపలికి వెళ్లే ముందు ఎలాంటి సంతకం చేయాల్సిన అవసరం లేదని ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంటర్ విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌ను తెచ్చుకోవాలని చెప్పింది. విద్యార్థులు పరీక్ష హాలుకు సమయానికి చేరుకోవాలని పేర్కొంది.

Also Read: అసెంబ్లీలో ఎన్ని గంటలైనా చర్చకు సిద్ధం.. కానీ, ఈ పనులు చేయొద్దు: హరీశ్ రావు

ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికీ గురవకుండా పరీక్షలు రాయాలని అన్నారు.

ముఖ్యాంశాలు

  • మార్చి 18తో ముగియనున్న పరీక్షలు
  • విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఒక గంట ముందే చేరుకోవాలి
  • పరీక్ష రాయాల్సిన విద్యార్థులు 9,97,075 మంది
  • ప్రథమ సంవత్సరం: 4,89,126 మంది
  • ద్వితీయ సంవత్సరం: 5,07,949 మంది
  • 28,500 మంది ఇన్విజిలేటర్ల నియామకం
  • 75 ఫ్లయింగ్ స్క్వాడ్లు
  • 200 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు
  • పరీక్షల పర్యవేక్షణకు 7,500 సీసీ కెమెరాలు ఏర్పాటు
  • మాల్ ప్రాక్టీస్ చేస్తే కఠిన చర్యలు