MLA Jaggareddy: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ

టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. వారు చిట్ చాట్ లో మాట్లాడారు. కూల్చేస్తాం, పెల్చేస్తాం అని అనొద్దని మీ రేవంత్ రెడ్డికి చెప్పొచ్చు కదా? అని జీవన్ రెడ్డి అన్నారు. ఆయన వ్యాఖ్యలకు జగ్గారెడ్డి స్పందిస్తూ.. ప్రగతి భవన్ కూల్చేస్తామని అనడం కాంగ్రెస్ విధానం కాదని అన్నారు. కూల్చేస్తాం, పెల్చేస్తాం అని అనడం ఉగ్రవాదులు, నక్సలైట్ల భాష అని చెప్పారు.

MLA Jaggareddy: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. వారు చిట్ చాట్ లో మాట్లాడారు. కూల్చేస్తాం, పెల్చేస్తాం అని అనొద్దని మీ రేవంత్ రెడ్డికి చెప్పొచ్చు కదా? అని జీవన్ రెడ్డి అన్నారు. ఆయన వ్యాఖ్యలకు జగ్గారెడ్డి స్పందిస్తూ.. ప్రగతి భవన్ కూల్చేస్తామని అనడం కాంగ్రెస్ విధానం కాదని అన్నారు. కూల్చేస్తాం, పెల్చేస్తాం అని అనడం ఉగ్రవాదులు, నక్సలైట్ల భాష అని చెప్పారు.

నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవాలని.. సోనియా గాంధీ నాయకత్వం లోని వైఎస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. రాజకీయ నాయకులు చట్టపరిధిలో పనిచేస్తే నక్సలైట్లు చట్ట వ్యతిరేకంగా పని చేస్తారని అన్నారు. కాంగ్రెస్.. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయని తెలిపారు. తమ పార్టీ ఉగ్రవాదానికి వ్యతిరేకమని జగ్గారెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ చెప్పేదే తమ పార్టీ విధానమని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఆ మాట అనకపోతే బాగుండేదని చెప్పారు.

టెర్రరిస్టు విధానాలకు కాంగ్రెస్ వ్యతిరేకమని అన్నారు. ఆ వ్యతిరేకత కారణంగానే దేశ భద్రత కోసం తీసుకున్న చర్యల కారణంగా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ బలయ్యాని వ్యాఖ్యానించారు. పాదయాత్ర లు ఎవరైనా చేసుకోవచ్చని తమ ఇన్ చార్జ్ ఠాక్రే చెప్పారని అన్నారు.

తనను ఎవరైనా పాదయాత్రకు పిలిస్తే.. ఆ నియోజకవర్గానికి వెళ్లి పాదయాత్రలో పాల్గొంటానని అన్నారు. ప్రస్తుతానికి నా జీవితం ముత్యాల ముగ్గులో హీరోయిన్ బతుకు అయిందని చెప్పారు. తన నియోజక వర్గ అభివృద్ధి కోసమే మంత్రి హరీశ్ రావుతో కలిసి నడుస్తున్నానని తెలిపారు. హరీశ్ ను కాదని వేరే వారిని కలిసి లాభం లేదని చెప్పారు.

Vijay Devarakonda: బెదురులంక టీజర్‌ను వదులుతున్న రౌడీ స్టార్..!