T.congress
congress party : తెలంగాణ కాంగ్రెస్ నేతల లొల్లి మళ్లీ మొదటికొచ్చింది. టీ కాంగ్రెస్‌లో కొత్త చిచ్చు రాజుకుంది. రాహుల్ సభ వేళ.. హస్తం పార్టీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. వరంగల్‌లో రాహుల్ గాంధీ సభ విజయవంతం చేసి క్రెడిట్ కొట్టేసేందుకు.. ఎవరి పాట్లు వారు పడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతల మీటింగ్ హాట్ టాపిక్‌గా మారింది. ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇంట్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. అయితే ఈసారి రాష్ట్రంలో రాహుల్ పర్యటన అంశంపై తలో దిక్కు అన్నట్టుగా ఉన్నారు.
Rahul Gandhi Tour: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన తేదీ ఖరారు: మే 6న వరంగల్‌లో భారీ బహిరంగ సభ
రాహుల్ గాంధీ వచ్చే నెల 6, 7 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్ టూర్‌కు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు విభేదాలకు కారణమైంది. అలాగే పలు అంశాలపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. దీంతో రేవంత్ రెడ్డికి సమాచారం ఇవ్వకుండా సీనియర్లు భేటీ అయ్యారు.
రాహుల్ సభ కోసం దగ్గరగా ఉండే జిల్లాలో పర్యటనలు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావించారు. అయితే రేవంత్ జిల్లా పర్యటనలపై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ, ఖమ్మం పర్యటనపై కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాహుల్ సభ ఒక్కరితో సక్సెస్ కాదంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.