ఆ మెసేజ్‌ను బయటపెట్టి మా నాన్న నా పరువు తీశారు: కేకే కుమారుడు విప్లవ్

తన మెసేజ్ బయట పెట్టడం తనకు ఇబ్బంది కలిగిస్తోందని విప్లవ్ కుమార్ తెలిపారు. రాజకీయాల్లో..

బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరడం వెనుక ఉన్న సరైన కారణాన్ని కె.కేశవరావు చెప్పలేకపోతున్నారని ఆయన కుమారుడు విప్లవ్ కుమార్ అన్నారు. 10 టీవీతో విప్లక్ కుమార్ మాట్లాడుతూ.. తాను మెసేజ్ పెట్టడం వెనుక వ్యక్తిగత కారణాలు ఉన్నాయని చెప్పారు. ఆ మెసేజ్ ను బయటపెట్టి కేకే తన పరువు తీశారని తెలిపారు.

ఎమోషనల్ గా కేకే ఫీలయ్యారని విప్లవ్ కుమార్ చెప్పారు. తన మెసేజ్ బయట పెట్టడం తనకు ఇబ్బంది కలిగిస్తోందని విప్లవ్ కుమార్ తెలిపారు. రాజకీయాల్లో ఆయన నిర్వహించని పదవులు లేవని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ లో చేరాలని తాను ఒత్తిడి చేశానని అన్నారు.

బీఆర్ఎస్ కూడా తమ కుటుంబానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని విప్లవ్ కుమార్ చెప్పారు. కాంగ్రెస్ లో ఉన్న సమయంలో ప్రతిపక్షంలో కూడా ఉన్నామని తెలిపారు. ఇప్పుడేమీ కొత్త కాదని అన్నారు.

ఇంకా ఏమన్నారు?

Also Read: చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల సమయంలో .. ఇప్పుడు దాడులు

ట్రెండింగ్ వార్తలు