ఆకతాయిగా విసిరిన రాయి కాదు.. జగన్ పై దాడి ఘటన గురించి సజ్జల కీలక వ్యాఖ్యలు

ఆకతాయిగా విసిరిన రాయి కాదు.. చాలా బలంగా తగిలింది. బలంగా ఏదోక పరికరం ఉపయోగించి గురిచూసి కొట్టినట్లు అనిపిస్తుందని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు.

ఆకతాయిగా విసిరిన రాయి కాదు.. జగన్ పై దాడి ఘటన గురించి సజ్జల కీలక వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy : సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి మంచిది కాదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్ పై దాడి ఘటన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డిని రాజకీయాల్లో దీటుగా ఎదుర్కోలేక ఇలాంటి పిరికి పనులు చేస్తున్నారని అన్నారు. దాడి చేసిన రాయి దొరలేదని సజ్జల చెప్పారు. కొంచెం కిందకి తగిలిఉంటే జగన్ కంటికి ప్రమాదం జరిగేదని, కొంచెం పక్కకు తగిలిఉంటే ప్రాణానికే ప్రమాదం అయ్యేదని సజ్జల ఆందోళన వ్యక్తం చేశారు. అది ఆకతాయిగా విసిరిన రాయి కాదు.. చాలా బలంగా తగిలింది. బలంగా ఏదోక పరికరం ఉపయోగించి గురిచూసి కొట్టినట్లు అనిపిస్తుందని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు.

Also Read : Vijayasai Reddy : అధికారం కోల్పోయినా.. చంద్రబాబు ఇంకా పాఠాలు నేర్చుకోలేదు

వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి గాయమైంది. ఈ ఘటన సీరియస్ గా చూడాల్సిన అవసరం ఉందని సజ్జల అన్నారు. ఒకే రాయి ఇద్దరికీ తగిలిందంటే.. ఎంత ఫోర్స్ గా వచ్చిందో అర్ధం అవుతుంది. దాడి చేసిన వ్యక్తి కారణాలు ఏంటి.. దాని వెనుక ఎవరు ఉన్నారు అనేది తెలియాలి. పోలీసుల నిర్లక్ష్యం అనడం సరికాదు. నిందితుడు ఎవరు.. ఎందుకు చేశారు అనేది కనుక్కోవాలి. ఘటనపై దర్యాప్తు జరుగుతుంది. దోషులు ఎవరో బయటకు వస్తుందని సజ్జల అన్నారు.

Also Read : BJP Manifesto 2024 : బీజేపీ మ్యానిఫెస్టో విడుదల.. కీలక అంశాలు ఇవే..

ఇలాంటి వాటికి భయపడి వెనక్కుతగ్గే మనిషి కాదు జగన్. మా పార్టీ కార్యకర్తలు, నేతలు సంయమనం పాటిస్తున్నారు. ప్రజల్లో ఉండే వ్యక్తికి భద్రత ఎంత వరకు ఉండాలో అంతే ఉండాలి. అధిక భద్రత వల్ల ప్రజలకు దూరం అవుతారు. అందుకే అదనపు భద్రత అడగడం లేదు. మనకి ఉన్నంత వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. చంద్రబాబు , లోకేశ్ లా భద్రత హడావిడి మాకు అలవాటు లేదని సజ్జల అన్నారు.