Vijayasai Reddy : అధికారం కోల్పోయినా.. చంద్రబాబు ఇంకా పాఠాలు నేర్చుకోలేదు

ఎం జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిలు అన్నారు

Vijayasai Reddy : అధికారం కోల్పోయినా.. చంద్రబాబు ఇంకా పాఠాలు నేర్చుకోలేదు

Vijayasai Reddy

Updated On : April 14, 2024 / 3:45 PM IST

Nellore MP YCP Candidate Vijayasai Reddy : సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిలు అన్నారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ పై జరిగిన దాడి చాలా హేయమైనది. గతంలోకూడా ఇదే తరహాలో దాడి జరిగింది. ఈ కుట్ర వెనుక చంద్రబాబు పాత్ర ఉండొచ్చునని విజయసాయి రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. గతంలో కత్తితో దాడి చేశారు.. ఆ నేరస్తుడు మొన్నటిదాకా జైల్లో ఉన్నాడు. అధికారం కోల్పోయినాకూడా చంద్రబాబు ఇంకా పాఠాలు నేర్చుకోలేదు. ఇలాంటి ఘటనలను ప్రజలు హర్షించరని విజయసాయి రెడ్డి అన్నారు.

Also Read : Jagan Mohan Reddy : బస్సు యాత్రలో సీఎం జ‌గ‌న్‌పై రాయిదాడి.. జాతీయ ఎన్నికల కమిషన్ సీరియస్

జగన్ పై రాయిదాడి ఘటన పట్ల ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలి. పూర్తిస్థాయిలో విచారణ జరపాలని విజయసాయిరెడ్డి కోరారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. దాడికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.