BJP Manifesto 2024 : బీజేపీ మ్యానిఫెస్టో విడుదల.. కీలక అంశాలు ఇవే..

సార్వత్రిక ఎన్నికలకు సంకల్ప పత్రం పేరుతో బీజేపీ మ్యానిఫెస్టోను ఆదివారం విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ,

BJP Manifesto 2024 : బీజేపీ మ్యానిఫెస్టో విడుదల.. కీలక అంశాలు ఇవే..

PM modi

BJP Manifesto for 2024 LS Polls : సార్వత్రిక ఎన్నికలకు సంకల్ప పత్రం పేరుతో బీజేపీ మ్యానిఫెస్టోను ఆదివారం విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ లు మ్యానిఫెస్టోను విడుదల చేశారు. రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ సంకల్ప పత్రాన్ని రూపొందించింది. మ్యానిఫెస్టో రూపకల్పన ప్రక్రియలో బృందం దేశంలోని 15లక్షల మంది సలహాలు, సూచనలు పరిశీలించింది. మోదీ గ్యారెంటీ, 2047నాటికి వికసిత భారత్ థీమ్ తో ఈ మ్యానిఫెస్టోను రూపకల్పన చేసినట్లు బీజేపీ పేర్కొంది. మ్యానిఫెస్టోలో విశ్వబంధు, సురక్షిత భారత్, సమృద్ధ భారత్, ఈజ్ ఆఫ్ లివింగ్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్, అత్యుత్తమ శిక్షణ, క్రీడా వికాసం, సంతులిత అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్ అనే 14 అంశాలను చేర్చారు.

Also Read : వికసిత్ భారత్ థీమ్‌తో బీజేపీ మ్యానిఫెస్టో.. హామీలపై సర్వత్రా ఉత్కంఠ

  • బీజేపీ మ్యానిఫెస్టోలో కీలక విషయాలు..
  • పేదలు, యువత, అన్నదాత, మహిళల అభివృద్ధిని పెట్టుకొని బీజేపీ సంకల్ప్ పత్రని విడుదల చేసింది.
  • ఉచిత రేషన్ పథకం వచ్చే ఐదేళ్లపాటు కొనసాగిస్తామని ప్రధాని మోదీ చెప్పారు.
  • 70ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ లో భాగంగా రూ. 5లక్షల వరకు ఉచిత వైద్యం.
  • ట్రాన్స్ జెండర్ లకు ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపు.
  • ప్రతి ఇంటికి తక్కువ ధరకే పైపులైన్ గ్యాస్ అందుబాటులోకి వచ్చేలా కృషి.
  • కరెంట్ బిల్లును జీరోకు తగ్గించేందుకు కృషి. ఇందులో భాగంగా ప్రధానమంత్రి సూర్య ఘర్ బిల్జీ యోజన పథకం అమలు.
  • ముద్రా యోజన రుణ పరిమితిని రూ. 10లక్షల నుంచి రూ. 20లక్షల వరకు పెంపు.
  • దేశంలో మరో మూడు బుల్లెట్ రైలు కారిడార్ లు నిర్మాణం.
  • దేశంలోని పశ్చిమ ప్రాంతంలో బుల్లెట్ రైలు (అహ్మదాబాద్ – ముంబై హై స్పీడ్ రైల్ కారిడార్) పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
  • దక్షిణ భారతదేశం, తూర్పు భారతదేశంలో ఒక్కో బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణం. వీటికి సంబంధించి సర్వే పనులు కూడా అతిత్వరలో ప్రారంభం.
  • వచ్చే ఐదేళ్లలో మరో 3కోట్ల కొత్త ఇళ్లు నిర్మాణం.
  • ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో వికలాంగులకు ప్రాధాన్యత.
  • మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చే ప్రణాళిక.
  • మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం.
  • రక్షణ, వంటనూనె, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధి.
  • స్వయం సహాయక సంఘాలకు మరింత మద్దతు.
  • ప్రపంచ వ్యాప్తంగా తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రాల ఏర్పాటు.
  • పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం యథావిధిగా కొనసాగింపు.
  • కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం నూతన క్లస్టర్లు.
  • చిన్న రైతుల లబ్ధికోసం శ్రీఅన్న సాగు ప్రోత్సాహం.
  • ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత.
  • డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెంపు.
  • మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్లు.
  • తమిళ భాష ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి కృషి.
  • ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే కొత్త శాటిలైట్ పట్టణాల ఏర్పాటు.
  • గిరిజన వారసత్వంపై పరిశోధనలకు ప్రోత్సాహం. డిజిటల్ ట్రైబల్ ఆర్ట్ అకాడమీని ఏర్పాటు.
  • విమానయాన రంగానికి ఊతం.
  • అంతరిక్ష రంగంలో భారత సామర్థ్యాన్ని పెంచేందుకు కచ్చితమైన ప్రణాళిక.
  • విదేశాల్లోని భారతీయుల భద్రతకు హామీ.
  • గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్ , ఇన్నోవేషన్, లీగల్ ఇన్సూరెన్స్, వాహన రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్ ల ఏర్పాటు.
  • ఈవీ (ఎలక్ట్రానిక్స్ మోటార్) మార్కెట్ కు ప్రోత్సాహం. గడిచిన పదేళ్లలో 17లక్షల వాహనాలు విక్రయాలు.
  • 5జీ నెట్ వర్క్ ను విస్తరించడంలో, 6జీ సాంకేతికతను అభివృద్ధికి కృషి.
  • భారత్ నెట్ ద్వారా 2లక్షలకుపైగా పంచాయతీలను బ్రాడ్‌బ్యాండ్‌కు అనుసంధానం.
  • ప్రతి గ్రామ పంచాయతీకి హైస్పీడ్ ఇంటర్నెట్.
  • ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే ఆలోచనను సాకారం చేసుకునే సంకల్పంతో ముందుకు.