వికసిత్ భారత్ థీమ్‌తో బీజేపీ మ్యానిఫెస్టో.. హామీలపై సర్వత్రా ఉత్కంఠ

BJP: నరేంద్రమోదీ, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జేపీనడ్డా మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.

వికసిత్ భారత్ థీమ్‌తో బీజేపీ మ్యానిఫెస్టో.. హామీలపై సర్వత్రా ఉత్కంఠ

PM modi

మీ భవిష్యత్‌కు మోదీ గ్యారెంటీ అంటూ ప్రజల్లోకి వెళ్తున్న బీజేపీ.. ప్రజాకార్షక పథకాలతో మ్యానిఫెస్టోను తయారు చేసింది. సంకల్ప్ పత్రా పేరుతో బీజేపీ మ్యానిఫెస్టోను ప్రకటించనుంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, రైతులు, పేదలే ప్రధాన అజెండాగా బీజేపీ మ్యానిఫెస్టో ఉండనుంది.

కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆధ్వర్యంలోని 27మంది సభ్యుల కమిటీ మ్యానిఫెస్టోను రూపొందించింది. ప్రజల నుంచి దాదాపు 15 లక్షల సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలిపారు బీజేపీ. ఇందులో నమో యాప్ ద్వారానే దాదాపు నాలుగు లక్షలకుపైగా ప్రజల సలహాలు, సూచనలు వచ్చాయంటున్నారు బీజేపీ నేతలు.

అంబేద్కర్‌ జయంతినే ఎంచుకోవడానికి రీజన్?
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న మ్యానిఫెస్టోను విడుదల చేసేందుకు కమలనాథులు సన్నాహాలు చేస్తున్నారు. మ్యానిఫెస్టో రిలీజ్‌కు అంబేద్కర్‌ జయంతినే ఎంచుకోవడానికి పెద్ద రీజనే ఉందని తెలుస్తోంది. ఈ మధ్య రాజ్యాంగాన్ని మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో అంబేద్కర్ అంటే తమకు ఎంత గౌరవమో చెప్పేందుకు, రాజ్యాంగానికి ఎటువంటి ముప్పు లేదనే సంకేతాన్ని ఇవ్వడం కోసమే ఏప్రిల్ 14న మ్యానిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ న్యాయ్ పత్ర్ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేస్తే.. బీజేపీ సంకల్ప్ పత్ర్ పేరుతో విడుదల చేయబోతుంది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని కసిగా ఉన్న కమలం పార్టీ.. ప్రతిపక్షాలను తలదన్నేలా ఆకర్షణీయ పథకాలతో మ్యానిఫెస్టో ఉండేలా ప్లాన్ చేసింది. 2047 నాటికి అభివృద్ధి భారతం సాధిస్తామనేది మోదీ ప్రధాన గ్యారెంటీగా ఉండనుంది.

సబ్ కా సాథ్ సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ సబ్‌కా ప్రయాస్ అనే ట్యాగ్‌లైన్‌తో సంకల్ప్ పత్ర్‌ ఉండనుంది. పలు కీలక అంశాలు మ్యానిఫెస్టోలో ఉంటాయన్న చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు బీజేపీ మ్యానిఫెస్టోలో రామమందిర నిర్మాణం, జమ్మూకశ్మీర్ అంశాలు ప్రధానంగా ఉండేవి.

రామమందిర నిర్మాణం అయిపోయింది. ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాతో పాటు రాజ్యాంగంలో మార్పులు, చేర్పులపై మ్యానిఫెస్టోలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నరేంద్రమోదీ, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జేపీనడ్డా మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.

YS Jagan: జగన్‌ బస్సుయాత్ర చేస్తున్న వేళ అరుదైన దృశ్యం