YS Jagan: జగన్‌ బస్సుయాత్ర చేస్తున్న వేళ అరుదైన దృశ్యం

YS Jagan: జగన్ బస్సులో వెళ్తున్న సమయంలో ఆయనను చూసేందుకు చాలా మంది

YS Jagan: జగన్‌ బస్సుయాత్ర చేస్తున్న వేళ అరుదైన దృశ్యం

YS Bharathi

Updated On : April 13, 2024 / 7:18 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి జంక్షన్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సుయాత్ర సందర్భంగా అరుదైన దృశ్యం కనపడింది. బస్సులో వస్తున్న జగన్‌కి ఆయన సతీమణి భారతి ప్రజల్లో నుంచి అభివాదం చేశారు. దీంతో బస్సులో నుంచే భారతికి అభివాదం చేశారు జగన్‌. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

జగన్ బస్సుయాత్ర చేస్తున్న సమయంలో ఆయనను చాలా మంది కలుస్తున్నారు. ఒక్కోసారి జగన్ బస్సును ఆపి మరీ ప్రజల కష్టాలను వింటున్నారు. జగన్ బస్సులో వెళ్తున్న సమయంలో ఆయనను చూసేందుకు చాలా మంది తరలివస్తున్నారు.

కాగా, గుంటూరు జిల్లాలో బస్సు యాత్ర చేసిన అనంతరం జగన్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగించారు. ఆయనకు కృష్ణా జిల్లా వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎంపీలు కేశినేని నాని, అవినాశ్, తదితర నేతలు జగన్ తో కలిసి బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఎన్నికల వేళ అభ్యర్థులందరి పేర్లనూ ప్రకటించిన జగన్.. పూర్తిగా ప్రచారంపైనే దృష్టి పెట్టారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Also Read : బీఆర్ఎస్‌ను భూస్థాపితం చేయడమే నా లక్ష్యం- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి