బీఆర్ఎస్‌ను భూస్థాపితం చేయడమే నా లక్ష్యం- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ ప్రాంతంలో ఉండగా ఇక్కడ ఏ పార్టీ ఉండదు. బ్రహ్మదేవుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఉండదు.

బీఆర్ఎస్‌ను భూస్థాపితం చేయడమే నా లక్ష్యం- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Raj Gopal Reddy

Komatireddy Raj Gopal Reddy : యాదగిరిగుట్టలో కాంగ్రెస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీర్ల ఐలయ్య, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. భువనగిరి గడ్డ అంటే.. కాంగ్రెస్ అడ్డా అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. గతంలో తాను ఎంపీగా చేసినప్పుడు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించారన్న రాజగోపాల్ రెడ్డి.. ఈసారి లక్ష మెజారిటీతో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ ను గెలిపించాలని కోరారు.

”కొందరు నాపై దుష్ప్రచారం చేశారు. నేను.. నా భార్య కోసం టికెట్ ఎప్పుడూ అడగలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో నా గెలుపునకు కృషి చేసిన వ్యక్తి బీర్ల ఐలయ్య. కేసీఆర్ కాదు వాళ్ళ అయ్య వచ్చినా భయపడను. కేసీఆర్ పదేళ్ల తర్వాత చిప్ప చేతికి ఇచ్చి వెళ్ళారు. సచివాలయం, యాదగిరిగుట్ట కట్టారు. కానీ, పేదలకు ఇల్లు కట్టించలేదు. బంగారు తెలంగాణ అని చెప్పి బాగుపడ్డ కుటుంబం కేసీఆర్ కుటుంబం ఒక్కటే. కేసీఆర్ దుకాణం బంద్.. బ్రహ్మ దేవుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఉండదు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.

తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరగాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరు మీద ఆరు గ్యారెంటీ స్కీములను అమలు చేసింది. చామలకిరణ్ కుమార్ కు ఆలేరులో అత్యధిక మెజార్టీ తీసుకురావాలి. కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ ప్రాంతంలో ఉండగా ఇక్కడ ఏ పార్టీ ఉండదు. చామల వెనుక కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు. నాణ్యమైన ప్రాజెక్టులు కడతాం కానీ.. వాళ్ళ లాగా కూలిపోయే ప్రాజెక్టులను మేము కట్టము. బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయడమే నా లక్ష్యం” అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Also Read : సై అంటే సై.. జహీరాబాద్‌ ఎంపీ సీటులో 3 పార్టీల మధ్య ఉత్కంఠ పోరు