Jagga Reddy: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించడం సరి కాదు: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం సరికాదని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. దీనివల్ల వైఎస్సార్‌కు చెడ్డపేరు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలని సూచించారు.

Jagga Reddy: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరికాదని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Himachal Pradesh: లోయలో పడ్డ టెంపో ట్రావెలర్.. ఏడుగురు మృతి.. పది మందికి గాయాలు

‘‘ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం సరి కాదు. ఈ వివాదంతో వైఎస్సార్‌కు చెడ్డపేరు వస్తుంది. ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలి. చంద్రబాబు చాలా దూరపు ఆలోచనతో అమరావతిని సెలెక్ట్ చేశారు. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం వల్ల ఉపయోగం లేదు. మా పార్టీ స్టాండ్ కూడా అమరావతే రాజధాని’’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తీరుపైనా జగ్గారెడ్డి విమర్శలు చేశారు. ‘‘షర్మిల.. తండ్రి బాటలో నడవడం లేదు. నేను ఏ పార్టీలో ఉంటే షర్మిలకు ఎందుకు? వైఎస్సార్ కూతురు అయినంత మాత్రాన మమ్మల్ని తిడితే ఊరుకుంటామా? తెలంగాణ కోడలుగా మోదీని షర్మిల ఎందుకు ప్రశ్నించడం లేదు?

Jupiter closest to Earth: నేడు భూమికి దగ్గరగా రానున్న గురు గ్రహం.. మళ్లీ 107 సంవత్సరాల తర్వాతే.. అందరూ చూడొచ్చంటున్న సైంటిస్టులు

నేతలను తిట్టేందుకే షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. షర్మిల జగన్‌తోపాటు బీజేపీ వదిలిన బాణం. అన్న చెబితే చెల్లెలు వినడం లేదా? చెల్లెలు చెబితే అన్న వినడం లేదా? బీజేపీ డైరెక్షన్‌లోనే అటు జగన్, ఇటు షర్మిల పనిచేస్తున్నారు. అడ్డగోలుగా సంపాదించిన సంపదను కాపాడుకునేందుకే జగన్, షర్మిల బీజేపీ కంట్రోల్‌లో పనిచేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావొద్దన్నదే వారి ప్లాన్’’ అని జగ్గారెడ్డి అన్నారు.