Jagga Reddy: నాలాంటి వారిని ఎలా వాడుకోవాలో ఇన్‌చార్జిలకు తెలియదు: జగ్గారెడ్డి

Jagga Reddy: ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ కార్యకర్తలకు ఓ లేఖ విడుదల చేశారు.

Jagga Reddy: కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో నాలాంటి వారిని ఎలా వాడుకోవాలో ఇన్‌చార్జిలకు తెలియదని జగ్గారెడ్డి అన్నారు. తమ కార్యకర్తలకు విడుదల చేసిన ఓ లేఖలో పలు వివరాలు తెలిపారు. 2017లో సంగారెడ్డిలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన సభ ఖర్చంతా తనదేనని అన్నారు. 2017లో తనకు ఉన్న గుర్తింపు ఇప్పుడు ఎక్కడికిపోయింది? అని నిలదీశారు.

రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తున్న సమయంలో సంగారెడ్డిలో ఖర్చంతా తనదేనని జగ్గారెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ తనను పిలిచి అభినందించారని అన్నారు. ఇన్‌చార్జిలకు మాత్రం తననకు ఎలా వాడుకోవాలో తెలియట్లేదని జగ్గారెడ్డి చెప్పారు. సంగారెడ్డిలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏర్పాట్లన్నీ తాను చూసుకున్నానని తెలిపారు.

తాను అప్పట్లో గాంధీ భవన్ కి వచ్చి హాయిగా కూర్చునేవాడినని ఇప్పుడు అలా కూర్చోలేకపోతున్నానని జగ్గారెడ్డి చెప్పారు. గాంధీ భవన్ వాతావరణం అప్పట్లో ఉన్నట్లు ఇప్పుడు లేదని తెలిపారు. అక్కడ ప్రశాంతత లేకుండాపోయిందని చెప్పారు. ఇంకా ఎన్నో విషయాలు తన మనసులోనే ఉంచుకుంటున్నానని అన్నారు.

Lightening Strike : షాకింగ్ వీడియో.. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై పిడుగు, అక్కడికక్కడే మృతి

ట్రెండింగ్ వార్తలు