బీఆర్ఎస్ పదేళ్లలో చేయలేక పోయింది.. రేవంత్ రెడ్డి 8 నెలల్లోనే చేశారు: జగ్గారెడ్డి

బీఆర్ఎస్ నేతలు ఇందులో కూడా బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేని రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి 8 నెలల్లోనే చేశారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒకవేళ టెక్నికల్ సమస్యలతో రుణమాఫీ కాకుంటే గ్రీవెన్స్ కూడా పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ చేస్తుందని తెలిపారు.

బీఆర్ఎస్ నేతలు ఇందులో కూడా బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. సీఎంకు కేటీఆర్ కొడంగల్ కు వస్తారా? నేను వస్తా? అని ఛాలెంజ్ చేశారని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరే స్థాయి కేటీఆర్‌కు లేదని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని, కాంగ్రెస్ పార్టీకి తాను వర్కింగ్ ప్రెసిడెంట్ అని అన్నారు.

కావాలంటే కేటీఆర్ సవాలును తాను స్వీకరిస్తానని జగ్గారెడ్డి చెప్పారు. దమ్ముంటే సంగారెడ్డికి రావాలని, లేదంటే సిరిసిల్లలో కూర్చుందామని అన్నారు. మాజీ సీఎం కొడుకు, మాజీ మంత్రి అని కేటీఆర్ ఫీల్ ఐతే.. తనతో సవాల్ వద్దనుకుంటే మంత్రి తుమ్మల, పొంగులేటి లేదంటే ఉత్తమ్‌ను పంపిస్తానని తెలిపారు. బీఆర్ఎస్ నేతలది దారం తెగిన గాలిపటంలా పరిస్థితి మారిందని అన్నారు.
కేటీఆర్ తెలియక చాలా కామెంట్స్ చేస్తున్నారని చెప్పారు.

Also Read: ఏపీకి నిధులు మంజూరు చేయండి- కేంద్రానికి సీఎం చంద్రబాబు విన్నపం

ట్రెండింగ్ వార్తలు