×
Ad

MLA Sanjay Kumar : నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే.. జగిత్యాల అభివృద్ధికోసమే సీఎం, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్న

MLA Sanjay Kumar : నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే. ఏ పార్టీలో చేరలేదు. నేను బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచిన అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.

MLA Sanjay Kumar

MLA Sanjay Kumar : తెలంగాణలోని పార్టీ ఫిరాయింపుల కేసులో మరో కీలక పరిణామం చేసుకుంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కు ఊరట లభించింది. ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టేశారు. సంజయ్‌పై అనర్హత కోరుతూ బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ కొట్టేస్తూ స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పునిచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారారని అనడానికి సరైన ఆధారాలు లేవని స్పీకర్ పేర్కొన్నారు. అయితే, తాజాగా జగిత్యాల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ మీడియాతో సమావేశంలో మాట్లాడారు..

Also Read : Mamata Banerjee : లాయర్‌గా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. దేశ చరిత్రలో తొలిసారి..

నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచిన.. నాజీతం నుంచి నెలకు రూ.5వేలు బీఆర్ఎస్ పార్టీకి కట్టవుతున్నాయని సంజయ్ అన్నారు. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ అఫిడవిట్ ఇచ్చినట్లు తెలిపారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఫార్టీ బిల్లులు ప్రవేశపెట్టి, విప్ జారీ చేస్తే నేను మద్దతు ఇస్తానని చెప్పారు.

నాతోని ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులకు ప్రచారం చేస్తానని చెప్పారు. నేను జగిత్యాల అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డితో, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. జగిత్యాల అభివృద్ధే నా ఆరాటమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, జగిత్యాల అభివృద్ధికి మద్దతుగా ఉన్న అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపించండని పిలుపునిచ్చారు. జగిత్యాల పట్టణంను ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తామని చెప్పారు. జగిత్యాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు.