Jai Bharat Party : జై మహాభారత పార్టీ పేరుతో అమాయక ప్రజలకు వల

జై మహాభారత పార్టీ పేరుతో అమాయక ప్రజలకు వల వేస్తున్నారు. పేద ప్రజలకు 200 గజాల ఇండ్ల స్థలం వైకుంఠ ట్రస్ట్ ద్వారా ఇస్తామని పలు బస్తిల్లో జై మహాభారత పార్టీ ప్రచారం చేసింది. దీంతో రవీంద్రభారతి ప్రక్కన ఓ ప్రైవేట్ భవనం ముందు భారీగా చేరుకున్నారు. తీరా వచ్చాక..

Jai Bharat Party : జై మహాభారత పార్టీ పేరుతో అమాయక ప్రజలకు వల వేస్తున్నారు. పేద ప్రజలకు 200 గజాల ఇండ్ల స్థలం వైకుంఠ ట్రస్ట్ ద్వారా ఇస్తామని పలు బస్తిల్లో జై మహాభారత పార్టీ ప్రచారం చేసింది. దీంతో మహిళలు సైఫాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలోని రవీంద్రభారతి ప్రక్కన ఓ ప్రైవేట్ భవనం ముందు భారీగా చేరుకున్నారు. తీరా వచ్చాక ఇళ్ల స్థలం ఎలా ఉన్నా..పార్టీ సభ్యత్వం చేతిలో పెట్టారంటూ మహిళలు వాపోయారు.

ఇళ్ల స్థలాలు ఇస్తారు కదాని ఆశపడి వచ్చిన మహిళలు పార్టీ సభ్యత్వం చేతిలో పెట్టేసరికి ఉసూరుమన్నారు. వచ్చిన మహిళల దగ్గర ఒక అథార్ కార్డు,రెండు ఫోటోలు..కరెంట్ బిల్ తీసుకొని ఆ పార్టీ సభ్యత్వం రసీదు ఇచ్చి పంపిస్తున్నారని జై మహాభారత్ పార్టీ శ్రేణులపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అమాయక ప్రజలను మోసం చేస్తున్న జై మహాభారత్ పార్టీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కానీ..జై మహాభారత్ పార్టీ సభ్యులు మాత్రం ముందుగా పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే ఇళ్ల స్థలాలు ఇస్తామని అదికూడా కొంతకాలం గడిచాక ఇస్తామని చెప్పుకొస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు