Vehicle RC card : వాహనదారులకు షాక్.. ఆర్సీ కార్డుల్లో ఫొటో మాయం? అసలు కారణం ఇదే!
Vehicle RC card : వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) కార్డుల్లో యజమాని ఫొటో కనిపించకుండా పోయింది.
Vehicle RC card
Vehicle RC card : వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) కార్డుల్లో యజమాని ఫొటో కనిపించకుండా పోయింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, పాత వాహనాల బదిలీ, యాజమాన్య మార్పు వంటి సేవల్లో గతంలో వాహన యజమాని ఫొటోను తప్పనిసరిగా నమోదు చేసేవారు. ఇప్పుడు కొత్తగా జారీ అవుతున్న స్మార్ట్ కార్డుల్లో మాత్రం చిరునామా, వాహన వివరాలు మాత్రమే ఉండటంతో వాహనదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 ఏళ్ల క్రితమే వాహన యజమాని ఫొటో గుర్తింపు విధానం అమల్లోకి వచ్చింది. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో యజమాని డిజిటల్ ఫొటో, సంతకాన్ని రవాణాశాఖ అధికారులు నమోదు చేసేవారు. వాహనం విక్రయం లేదా యాజమాన్య బదిలీ సమయంలో సంబంధిత వ్యక్తి వివరాలను ధ్రువీకరించేందుకు ఈ ఫొటో గుర్తింపు ఉపయోగపడేది. వాహనాన్ని ఒకరి నుంచి మరొకరికి అక్రమంగా బదిలీ చేయకుండా నియంత్రించేందుకు కూడా ఇది దోహదపడుతుందని అధికారులు భావించేవారు.
దేశవ్యాప్తంగా వాహన రిజిస్ట్రేషన్, యాజమాన్య మార్పు వంటి సేవలను ఒకే విధానంలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ‘వాహన్’ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్సీ స్మార్ట్ కార్డుల్లో యజమాని ఫొటోను ముద్రించే పద్ధతి తొలగిపోయింది. దీంతో ప్రస్తుతం వాహనదారులకు గతంలో మాదిరిగానే స్మార్ట్ కార్డులు అందుతున్నప్పటికీ.. వాటిపై యజమాని ఫొటో మాత్రం ఉండటం లేదు. పాత ఆర్సీ కార్డుల్లో ఫొటో ఉండగా, కొత్త కార్డుల్లో లేకపోవడంతో వాహనదారులు తేడాను గుర్తిస్తున్నారు.
వాహన ఆర్సీల్లో యజమాని ఫొటో లేకపోవడంకు కారణం ‘వాహన్’ పోర్టల్ ఆధారంగా దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేయడమేనని తెలుస్తోంది. అయితే, ఫొటో గుర్తింపు తొలగింపుతో వాహన యాజమాన్య బదిలీల్లో మోసాలకు అవకాశం ఉందా? అనే సందేహాలు వాహనదారుల్లో వ్యక్తమవుతున్నాయి. సెకండ్ హ్యాండ్ వ్యక్తిగత, వాణిజ్య వాహనా ల విక్రయ సమయంలో విక్రేత, కొనుగోలుదారు ఆర్టీఏ అధికారి సమక్షంలో వివిధ పత్రాలపై సంత కాలు చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఫొటో గుర్తింపు ఆధారంగా వాహన యజమానిని గుర్తిం చేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దీన్ని తొలగించడం వల్ల యజమానుల ప్రమేయం లేకుండానే మరొ కరికి బదిలీ అయ్యే ప్రమాదం ఉందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై రవాణాశాఖ మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
