Telangana : నా దుస్థితి ఎవ్వరికి రాకూడదు.. నా కుమార్తెను స్వార్ధ రాజకీయాలకు పావుగా చేయటం సరికాదు : ముత్తిరెడ్డి

నాపై నా కుమార్తె భూకబ్జా ఆరోపణలు చేయటం చాలా బాధకలిగిస్తోందని..చేర్యాలలో 1200 గజాల స్థలం నాకూతురు పేరునే ఉందని స్పష్టంచేశారు. హబ్సిగూడలోని స్వాగత్ గ్రాండ్ హోటల్, ఇప్పుడు కిన్నెర గ్రాండ్ గా మారిందని అది కూడ నా కూతురు పేరుమీదనే ఉందని తెలిపారు.

Muthireddy Yadagiri Reddy

Muthireddy Yadagiri Reddy : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు తుల్జా భవానీ రెడ్డి తన తండ్రిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సిద్ధిపేట జిల్లా చేర్యాలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని.. ఎకరం 20 గుంటల భూమిని కబ్జా చేశారని తండ్రి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఆయన కూతురు తుల్జా భవానీ రెడ్డి ఫిర్యాదు చేశారు. కన్నకూతురే తనపై భూకబ్జా చేశాడని ఆరోపిస్తు కేసు పెట్టటంపై ముత్తిరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రతి ఇంటిలో కుటుంబ సమస్యలు ఉంటాయి కానీ తనకు వచ్చిన ఈ దీనావస్థ ఎవరికి రాకూడదు అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయ ప్రథ్యర్థులు తన బిడ్డను తమ స్వార్ధ రాజకీయాలకు వినియోగించుకుంటున్నారని.. ఎన్నికలు దగ్గరికి వచ్చాయనే తనపై ఇటువంటి ఆరోపణలు చేస్తు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు. రాజకీయాలను వ్యక్తిగత విషయాల్లోకి తీసుకురాకూడదని అన్నారు. రాజకీయాలు చేయాలంటే తనను ప్రజాక్షేత్రంలో నన్ను ఎదుర్కోవాలి తప్ప ఇలా కుటుంబాల్లో చిచ్చులు పెట్టకూడదని ఇటువంటి రాజకీయాలు సమాజానికి హానికరమని అన్నారు. కుళ్లు రాజకీయాలు చేయటం సరికాదని, ఇది తన ప్రత్యర్థుల విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.

Muthireddy Yadagiri Reddy : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు నమోదు

తనపై కన్నకూతురే భూకబ్జా ఆరోపణలు చేయటం చాలా బాధకలిగిస్తోందని.. చేర్యాలలో 1200 గజాల స్థలం తన కూతురు పేరునే ఉందని స్పష్టంచేశారు. హబ్సిగూడలోని స్వాగత్ గ్రాండ్ హోటల్, ఇప్పుడు కిన్నెర గ్రాండ్ గా మారిందని అది కూడా తన కూతురు పేరుమీదనే ఉందని తెలిపారు. దాని రెంట్ అగ్రిమెంట్ మాత్రమే రెన్యువల్ అయిందని తెలిపారు.

“నా కూతురితో నాకు విభేధాలు ఉన్నమాట వాస్తవమే కానీ అవి మా కుటుంబ విషయాలు.. రాజకీయాలకు సంబంధం లేదు..  మేము మేము కూర్చుని మాట్లాడుకుంటాం మా కుటుంబంలోనే తేల్చుకుంటాం. కానీ ఇలా కుటుంబ సమస్యలను రాజకీయాలు చేయటం చేతకానితనం. చేతనైతే నాతో ప్రజాక్షేత్రంలో తలపడాలి. నేను తప్పు చేసి ఉంటే ప్రజా క్షేత్రంలో ప్రజలే నాకు బుద్దిచెప్తారు. అంతే తప్ప కుటుంబ తగాదాలను ప్రజాక్షేత్రంలోకి లాగడం సరైంది కాదు. నేను తప్పుచేస్తే మా పార్టీ అధినేత కేసిఆర్ ఊరుకోడ”ని తేల్చి చెప్పారు ముత్తిరెడ్డి.