Janata Curfew : హైదరాబాద్ మెట్రో బంద్..ఆర్టీసీ బస్సులు కూడా ? 

  • Publish Date - March 21, 2020 / 07:50 AM IST

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూకు విపరీతమైన రెస్పాండ్ వస్తోంది. పలు రాష్టాల ప్రభుత్వాలు మద్దతునిస్తున్నాయి. ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాయి. 2020, మార్చి 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బయటకు రావొద్దని మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

దీంతో ప్రజలకు బయటకు రాకుండా ఉంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నాయి తెలుగు రాష్ట్రాల ప్రజలు. ప్రజా రవాణాపై ఆంక్షలు విధిస్తున్నారు. ఆదివారం మెట్రో సర్వీసులను నిలిపివేస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. జనతా కర్ఫ్యూకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకుంది. 

See Also | ఏపీలో ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు బంద్

ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులతో ఆర్టీసీ ఎండీ చర్చిస్తున్నారు. బస్సులు నడపాలా ? వద్దా ? అనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు. 

హైదరాబాద్ మెట్రో రైలు..ఆర్టీసీ తర్వాత..ప్రజలును అత్యధికంగా వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది. దాదాపు నాలుగు లక్షలకు పైగా మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సంఖ్య తగ్గింది. ఆదివారం రోజు కావడంతో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. భారత ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు మెట్రో నిలిపివేస్తే బెటర్ అని, దీనివల్ల ప్రజలు ఇంట్లో ఉండే పరిస్థితి ఉందని అధికారులు భావిస్తున్నారు. 

Read More : చేతులు ఎలా వచ్చాయి తల్లి : ఆడ శిశువు నోట్లో జిల్లేడు పాలు పోసి చంపేశారు

ట్రెండింగ్ వార్తలు