Jawahar Nagar Incident: ఏడాది తర్వాత.. మహిళ మిస్సింగ్ కేసులో వీడిన మిస్టరీ.. కన్న కూతురే హంతకురాలు

పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేపట్టారు. వారి దర్యాప్తులో హత్య ఉదంతం బయటపడింది.

  • Published On : March 25, 2026 / 07:14 PM IST

 

Jawahar Nagar Incident: హైదరాబాద్ శివారు జవహర్‌నగర్‌లో మహిళ మిస్సింగ్ కేసులో మిస్టరీని పోలీసులు చేదించారు. ఏడాది తర్వాత ఈ కేసులో సంచలన నిజం బయటపడింది. మహిళ దారుణ హత్యకు గురైంది. కన్న కూతురే హంతకురాలు అని తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. మే 12 2025న అంజు అనే మహిళ ఇంట్లోనే హత్యకు గురైంది. కన్న కూతురే ఆమెను కడతేర్చింది. అంతేకాదు శవాన్ని ఇంట్లోనే పాతి పెట్టింది. తన ప్రేమ వ్యవహారాన్ని వ్యతిరేకించిన తల్లిని ప్రియుడి సాయంతో హత్య చేసింది కూతురు.

కత్తితో పొడిచి అంజుని హత మార్చారు. హత్య అనంతరం ఇంట్లోనే మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. సిమెంట్‌తో కప్పేశారు. అంజు కనిపించడం లేదని కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు అక్టోబర్ 2025లో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు పోలీసులు. ఇంట్లో గుంతల గురించి కుటుంబసభ్యులు ప్రశ్నించగా.. ఎలుకలు గుంతలు చేశాయని నిందితులు వారిని మభ్యపెట్టారు.

పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేపట్టారు. వారి దర్యాప్తులో హత్య ఉదంతం బయటపడింది. ప్రియుడు మోంటి కుమార్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ కూతురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అంజు హత్యలో ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సెక్షన్లు మార్చి హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రియుడి మోజులో కన్నతల్లినే కూతురు అత్యంత దారుణంగా కడతేర్చి, శవాన్ని ఇంట్లోనే పాతి పెట్టిన వైనం సంచలనంగా మారింది.